బయోపిక్‌ పనిలో సింగీతం

Update: 2020-03-19 05:38 GMT
గ్రాఫిక్స్‌ పెద్దగా లేని సమయంలోనే వెండి తెరపై అద్బుతాలను ఆవిష్కరించిన విజువల్‌ మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు ఆమద్య బాలయ్యతో ఆధిత్య 369 చిత్రానికి సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలయ్య కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని అవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయింది. ఇప్పుడు సింగీతం గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఒక బయోపిక్‌ కోసం స్క్రిప్ట్‌ ను సిద్దం చేస్తున్నారట. లెజెండ్రీ సింగర్‌ కథతో సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడట. ఆ లెజెండ్రీ సింగర్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా ప్రారంభం సమయంలో అన్ని విషయాలను సింగీతం వెళ్లడి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సింగర్‌ బయోపిక్‌ కోసం ఆయన స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

టాలీవుడ్‌ లో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన సింగీతంకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కనుక ఆయన తీయబోతున్న బయోపిక్‌ ను పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రముఖ సింగర్‌ ఎవరు అనేది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. మరి ఆ ప్రశ్నకు సింగీతం ఎప్పుడు సమాధానం చెప్తాడో చూడాలి.
Tags:    

Similar News