• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ బ్లాక్‌ బస్టర్‌ సినిమా...

ఆ బ్లాక్‌ బస్టర్‌ సినిమా లో ముందు విజయే హీరో.. కానీ వదులు కున్నాడు : శంకర్

By - Tupaki Desk
Update: 2020-09-16 09:50 GMT
యాక్షన్ కింగ్ అర్జున్ హీరో, మనీషా కొయిరాలా హీరో  హీరోయిన్‌లు గా  కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ముదల్వాన్‌(తెలుగులో ఒకే ఒక్కడు) సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 1999లో విడుదల అయిన ఈ సినిమా కలెక్షన్ల తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది. ఈ సినిమాతో అర్జున్ కి వచ్చిన స్టార్డం అంతా ఇంతా కాదు. తెలుగులోనూ ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఏఆర్ రెహమాన్ అదిరి పోయే మ్యూజిక్ ఇచ్చాడు.

 ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం అన్న కాన్సెప్ట్‌ అందరికీ నచ్చింది. ఆ తరువాత పలు   సినిమాల్లో ఆ కాన్సెప్ట్ ని వాడుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన సినిమాలో మొదట హీరో అర్జున్ కాదట. దర్శకుడు శంకర్ ఈ మూవీని దళపతి విజయ్‌తో తీయా లనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్‌ ఈ సినిమాను వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ కథను శంకర్ అర్జున్  కు వినిపించడం..ఆయనకు  బాగా నచ్చడంతో పట్టాలెక్కించారు. అయితే  ఈ సినిమాను విజయ్  ఎందుకు వద్దనుకున్నారో చెబుతూ ఆనాటి సంగతులను శంకర్ వెల్లడించారు.

ముందుగా ఒకే ఒక్కడు స్క్రిప్ట్  సిద్ధం చేసిన శంకర్  కథ వినిపించేందుకు మొదట విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దగ్గరకి వెళ్లారట. ఆయనకు ఈ కథ బాగా నచ్చినప్పటికీ విజయ్‌ అప్పటికే మరిన్ని ప్రాజెక్ట్‌లను ఒప్పుకుని ఉండటంతో డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ సూపర్ హిట్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో చాలా ఏళ్ల వరకు సినిమా రాలేదు.

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన త్రీ ఇడియట్స్ మూవీ శంకర్ కు నచ్చడంతో ఆ సినిమాను  ఆయన తమిళ్ లో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. అదే  నన్బన్‌. తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శంకర్ కమలహాసన్ తో భారతీయుడు-2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఒకే ఒక్కడు సీక్వెల్ తీయాలని శంకర్ అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం  విజయ్ ని తీసుకోవాలని  ఆయన భావిస్తున్నారట. అయితే ఈసారైనా విజయ్ ఓకే చెప్తారా  లేదా అని దళపతి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS