తీవ్ర అస్వస్థకు గురైన లేడీ డైరెక్టర్.. ఐసీయూలో చికిత్స...?
ప్రముఖ లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఉదయం నుండి వార్తలు వస్తున్నాయి. తీవ్ర అస్వస్థతో హైదరాబాద్ సోమాజీగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోందని సమాచారం. హై ఫీవర్ వలన మెదడులో అధిక రక్తస్రావం అయినట్లు వైద్య వర్గాలు చెప్తున్నాయని.. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని ప్రముఖ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. అయితే ఆమె పరిస్థితి మెరుగుపడిందట. ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారట.
కాగా 2018లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన 'రాజుగాడు' సినిమాతో సంజన రెడ్డి దర్శకురాలిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ సినిమా తరవాత ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ మీద సినిమా తీయడానికి రెడీ అయ్యారు సంజన రెడ్డి. ఇటీవలే కరణం మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ఎంవీవీ సినిమా మరియు కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంవీవీ సత్యనారాయణ - కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రచయిత - నిర్మాత అయిన కోన వెంకట్ స్పందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం సంజన మూడు రోజులుగా లిక్విడ్ డైట్ లో ఉన్నారని.. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ లో చేర్పించారని.. సోమవారం రాత్రి ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని కోన వెంకట్ స్పష్టం చేశారట. అంతేకాకుండా కరణం మల్లేశ్వరి బయోపిక్ కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని కూడా కోన వెంకట్ వెల్లడించినట్లు ప్రముఖ ప్రసార మాద్యమాలు తెలియజేస్తున్నాయి. మరి సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.