యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ 'దురంధ‌ర్‌'ని కొట్టేలా పైడిప‌ల్లి ప్లాన్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ (#SVC63)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Update: 2026-06-30 04:16 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ (#SVC63)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్న వంశీ పైడిపల్లి.. ఈ చిత్రం కోసం భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇందులోని స్టంట్స్, మేకప్ విషయాల్లో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడానికి, ఈ ఏడాది బిగ్గెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీగా నిలిచిన `ధురంధర్` సాంకేతిక బృందాన్ని రంగంలోకి దించార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పవర్‌ఫుల్ గా.. రఫ్ యాక్షన్ అవతార్‌లో చూపించబోతున్నారు. ఇందుకోసం ప్రపంచ సినిమాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్షన్ డైరెక్టర్లలో ఒకరైన కొరియన్ స్టంట్ మాస్టర్ సీ యంగ్ ఓహ్ (మిస్టర్ ఓహ్ అని పిలుస్తారు)ను యాక్షన్ కొరియోగ్రఫీ కోసం ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ శైలి యాక్షన్ మూవీ `వార్`, మైండ్ బ్లోయింగ్ రా యాక్షన్ ఫిల్మ్ `కిల్` చిత్రాలతో పాటు `ధురంధర్` సినిమాకు అద్భుతమైన స్టంట్స్ సమకూర్చిన మిస్టర్ ఓహ్.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం ఒక ఇంటెన్స్, అగ్రెసివ్ స్టైల్ లో క్లాప్స్ కొట్టించే రేంజ్‌లో ఉండే భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేస్తున్నారట‌.

సినిమాలో కేవలం స్టంట్స్ మాత్రమే కాకుండా... మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా, ప్రేక్షకులు షాక్ అయ్యే రేంజ్‌లో ఉండబోతోంది. ఇందుకోసం కూడా `ధురంధర్` చిత్రానికి పనిచేసిన ప్రముఖ ప్రాస్థెటిక్ అండ్ మేకప్ ఎక్స్‌పర్ట్ ప్రీతిషీల్ సింగ్ ను రంగంలోకి దించార‌ని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ముఖ కవళికలకు.. ఆయన క్యారెక్టర్ ఇంటెన్సిటీకి సరిపోయేలా సరికొత్త ప్రాస్థెటిక్ మేకప్‌ను ప్రీతిషీల్ సింగ్ డిజైన్ చేస్తుండటంతో లార్జర్ దేన్ లైఫ్‌ క్యారెక్టరైజేషన్స్‌ను ఇష్టపడే అభిమానులకు ఈ లుక్ ఒక పెద్ద విజువల్ ట్రీట్ కానుంది.

టాలీవుడ్ మేకింగ్ వాల్యూస్- బాలీవుడ్ స్టార్ పవర్ కలబోత‌గా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్యూర్ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా.. వెర్స‌టైల్ స్టార్ అరవింద్ స్వామి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లుక్స్, కాస్టింగ్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలోనూ `ధురంధర్` సాంకేతిక బృందం నుంచి ఇన్‌పుట్స్ యాడ్ అవ్వడంతో.. వంశీ పైడిపల్లి యాక్షన్ ఎపిసోడ్స్ మేకింగ్ ప‌రంగా సరికొత్త వేవ్ ను సృష్టించబోతున్నారని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్‌ను -సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రంతో సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు తిర‌గ‌రాయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తున్నార‌ని తెలుస్తోంది. అధికారికంగా చిత్ర‌బృందం నుంచి మ‌రిన్ని వివ‌రాలు వెలువ‌డాల్సి ఉంది.

Tags:    

Similar News