సేఫ్ మెసేజ్ జోన్ నుండి గ్లోబల్ సర్వైవల్ అడ్వెంచర్‌కు షిఫ్ట్!

ఇది కేవలం పాన్-ఇండియా ప్రాజెక్ట్ మాత్ర‌మే కాదు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్.

Update: 2026-06-30 04:59 GMT

రెండున్న‌ర ద‌శాబ్దాలుగా సూపర్ స్టార్ మహేష్ ప్రయాణం నిర్దిష్టమైన, సురక్షితమైన ఫార్మాట్‌లో సాగింది. `శ్రీమంతుడు`, `మహర్షి`, `సర్కారు వారి పాట` వంటి చిత్రాలతో సామాజిక సందేశాలు, స్టైలిష్ కార్పొరేట్ లుక్స్‌కే పరిమితమయ్యారు. క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తూనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు న‌మోదు చేసారు. ఈ నేప‌థ్యంలో నటుడిగా తనను తాను సేఫ్ మెసేజ్ జోన్ లో బంధించుకున్నారనే విమర్శలు కూడా ఎదు ర్కొన్నారు. ఈ పదేళ్ల కాలంలో మ‌హేష్ బాడీ లాంగ్వేజ్, పాత్రల ఎంపికలో పెద్దగా వైవిధ్యం కనిపించలేదు. దాదాపు రొటీన్ గానే సాగింది. కానీ ఇప్పుడు ఆ సాఫ్ట్ అండ్ స్టైలిష్ ఇమేజ్‌ను పూర్తిగా చెరిపేస్తూ రాజమౌళితో కలిసి గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ `వార‌ణాసి`కి ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇది కేవలం పాన్-ఇండియా ప్రాజెక్ట్ మాత్ర‌మే కాదు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్. ఇన్నేళ్లుగా అలవాటైన ఫార్ములా కథల నుంచి బయటపడి, ఊహకందని హై-యాక్షన్ ప్యాక్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం మహేష్ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద సాహసం ఇది. ఈ మహాకార్యం కోసం మహేష్ భౌతిక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నారు. జర్మనీలో అత్యంత కఠినమైన ట్రెకింగ్ శిక్షణ తీసుకున్నారు. హై-యాక్షన్ సర్వైవల్ మోడ్‌కు శరీరాన్ని సన్నద్ధం చేసారు. గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మ‌హేష్ మేకోవర్ ఇప్పటికే ప్రేక్షకులకు ఓ రగ్గడ్ అండ్ వైల్డ్ లుక్‌ను పరిచయం చేసింది.

దశాబ్ద కాలంగా మెయింటైన్ చేసిన సాఫ్ట్ బాయ్.. క్లీన్ షేవ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి శారీరకంగా ఇంతటి కఠినమైన మార్పులకు గురికావడం మ‌హేష్ డెడికేషన్‌కు నిదర్శనం. ఈ మార్పు మహేష్ కు మైండ్ బ్లోయింగ్ సవాళ్లను విసురుతుంది. రాజమౌళి సినిమాలు అంటేనే శారీరకంగా, మానసికంగా నటీనటుల నుంచి నూటికి నూరు శాతం పిండుకునే ప్రయత్నం. ఇంతకాలం తనదైన ఒకే రకమైన డైలాగ్ డెలివరీ, తక్కువ శారీరక శ్రమతో నెట్టుకొచ్చిన మహేష్ ఇప్పుడు రాజమౌళి ఆశించే లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్‌ప్రెషన్స్, ప్రమాదకరమైన యాక్షన్ స్టంట్స్, ప్రాణాపాయ స్థితుల్లో సాగే పోరాటాలకు తగ్గట్టుగా తనను తాను పూర్తిగా కొత్త‌గా మ‌లుచుకుంటున్నారు.

ఇక గ్లోబల్ ఆడియన్స్‌కు మహేష్ ఇమేజ్‌ను రీఇన్వెంట్ చేయడం మరో అతిపెద్ద సవాలు. `ఆర్ఆర్ఆర్` తర్వాత భారతీయ యాక్షన్ హీరోల పట్ల అంతర్జాతీయ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను మ్యాచ్ చేసేలా, నేచురల్‌గా కనిపించే ఫిజికల్ సర్వైవల్ సీన్స్‌లో మహేష్ నటించాలి. ఆయనలోని సహజమైన ఛరిష్మాను ఏమాత్రం తగ్గనివ్వకుండానే అడ్వెంచర్ సర్వైవర్‌గా ప్రపంచ ప్రేక్షకులను ఒప్పించ‌డం మామూలు విషయం కాదు. దీనికోసం మ‌హేష్ మునుపెన్నడూ చేయని విధంగా స్టామినాను ప‌రీక్షంచుకునే ముందు కెళ్తు న్నారు. ఇది మహేష్ కు నటుడిగా పునర్జన్మ లాంటిదే. కంఫర్ట్ జోన్‌ను బద్దలు కొట్టుకుని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు మహేష్ చేస్తున్న ప్రయత్నం భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News