• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైరెక్ట‌ర్ వెంట‌ప‌డి మ‌రీ...

డైరెక్ట‌ర్ వెంట‌ప‌డి మ‌రీ ఒప్పించాడ‌ట‌

By - Tupaki Desk
Update: 2019-11-08 03:56 GMT
దాదాపు ద‌శాబ్ధం పాటు రాజ‌కీయాల్లో త‌ల‌మునక‌లుగా ఉన్న విజ‌య‌శాంతిని తెలుగు.. త‌మిళంలో ఎంతోమంది ద‌ర్శ‌కులు న‌టించాల్సిందిగా సంప్ర‌దించినా స‌సేమిరా అన్నారు. అయితే ఎఫ్ 2 ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి త‌న‌కి ఏం చెప్పి ఒప్పించ‌గ‌లిగారు? అంటే  లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి స్వ‌యంగా ఆ సీక్రెట్ గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెన‌య్యారు.

ఈ ద‌శాబ్ధ కాలంలో ఎంద‌రో ద‌ర్శ‌కులు నా వెంట ప‌డ్డారు. సినిమాల్లో న‌టించాల్సిందిగా అడిగారు. కానీ నేను అంగీక‌రించ‌లేదు. అంద‌రు ద‌ర్శ‌కుల్లానే .. అనీల్ రావిపూడి ఎప్ప‌టి నుంచో న‌న్ను న‌టించాల్సిందిగా సంప్ర‌దించారు. నేను ర‌క‌ర‌కాల వ్యాప‌కాల్లో బిజీగా ఉన్న‌ప్పుడు ఏదో సినిమా గురించి చెప్పాడు. అప్ప‌ట్లో న‌టించ‌ను అని చెప్పాను. చూద్దాం ఆ ఆలోచ‌న వ‌స్తే అని తిర‌స్క‌రించాను. కానీ ఆయ‌న విడిచి పెట్ట‌లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అప్రోచ్ అయ్యారు. గ‌త‌ ఎన్నిక‌లు జరుగుతున్న స‌మ‌యంలో న‌న్ను క‌లిసి ఒక‌సారి క‌థ వినండి న‌చ్చితే చేయండి.. అని అన్నారు. ఎన్నిక‌లు అయిపోయాక ఫ్రీ అవుతాను. న‌చ్చితే చేస్తాను. న‌చ్చ‌క‌పోతే చేయ‌ను. త‌ప్పుగా అనుకోకండి అన్నాను. ఆ త‌ర్వాత క‌థ విన్నాను. క‌థ‌లో కామెడీ బాగా ఎంజాయ్ చేశాను. న‌వ్వి న‌వ్వి క‌డుపు నొప్పి వ‌చ్చేంత‌గా న‌వ్వాను. నా పాత్ర గురించి మ‌ళ్లీ విన్నాను. బావుంది అన్నాను. బావుంది అన్న త‌ర్వాత చేయాల్సిందే. రిజెక్ట్ చేయ‌డం త‌ప్పు అవుతుంద‌ని ఓకే చెప్పాను. నా రీఎంట్రీకి ఇది క‌రెక్ట్ గా ఉంటుంది అనిపించి ఓకే చెప్పాను.. అని విజ‌య‌ శాంతి తెలిపారు.

ఒక సూప‌ర్ స్టార్ న‌టిస్తున్న సినిమాలో ఫీమేల్ కి ఇంత మంచి పాత్ర ఉండ‌డం రేర్. నేను హీరోల‌తో చేసేప్పుడు వేరు. ఇప్పుడు వేరు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కులు డిఫ‌రెంటుగా వెళుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక హీరో సినిమాలో నా పాత్ర ఇలా కుద‌ర‌డం అరుదు అనే  చెప్పాలి. హుందాగా ఉండే పాత్ర ఇది. మిమ్మ‌ల్ని దృష్టి లో పెట్టుకునే ఈ పాత్ర‌ను రాశాన‌ని అనీల్ అన్నారు. అందుకే న‌టించాను.. అని తెలిపారు. స‌రిలేరు నీకెవ్వ‌రు సెట్స్ నుంచి సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి కాంబినేష‌న్ సీన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రం లో విజ‌య‌శాంతి భార‌తి అనే లేడీ ప్రొఫెస‌ర్ గా న‌టిస్తున్నారు. మ‌హేష్ ఆర్మీ మేజ‌ర్ గా న‌టిస్తూనే డిఫ‌రెంట్ షేడ్ తో ఆక‌ట్టుకోనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Mahesh Babu 
  • Tollywood 
  • Kollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Latest News 
  • Telugu Movie News 
  • Anil Ravi Pudi 
  • Tupaki News 
  • Vijaya Shanthi 

Similar News

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

Copyright @2026

Powered by Blink CMS