• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పరశురామ్ కి సూపర్ లక్

పరశురామ్ కి సూపర్ లక్

By - Tupaki Desk
Update: 2018-07-25 14:14 GMT
కొన్నిసార్లు వేచి చూడటం మంచి ఫలితం ఇస్తుంది. కాకపోతే దానికి చాలా ఓపిక సహనం ఉండాలి. సినిమా పరిశ్రమలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటేనే మనుగడ సాధ్యం. ఇది గుర్తించాడు కాబోలు దర్శకుడు పరశురామ్ సరైన టైంలో తగిన ఫలితాలు అందుకుంటున్నాడు. ఆగస్ట్ 15న విడుదల కానున్న గీత గోవిందం వైపే ట్రేడ్ తో సహా ప్రేక్షకుల చూపు ఉంది. దానికి కారణం  విజయ్ దేవరకొండ ఒక్కడే కాదు. గోపి సుందర్ ఇచ్చిన ట్యూన్-వెరైటీగా కట్ చేసిన టీజర్ వెరసి సినిమా మీద యూత్ తో పాటు సాధారణ  ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు కలిగేలా చేసింది. నిజానికి దీని వెనుక ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది.

అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు చేస్తున్న టైంలో పరశురామ్ పనితనాన్ని పసిగట్టిన అల్లు అరవింద్ నెక్స్ట్ మూవీకి  కూడా ఆ షూటింగ్ టైంలోనే లాక్ చేసుకున్నాడు.  కానీ హీరో కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు విజయ్ దేవరకొండ గీత బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు అప్పటికే సైన్ చేసాడు. వేర్వేరుగా ఎందుకులే అని చెప్పి ఈ ఇద్దరి కాంబోని సెట్ చేసేసారు అరవింద్. అది గీత గోవిందం రూపంలో వస్తోంది.

పరశురామ్ సెంటిమెంట్ ఎమోషన్ ని ఎంటర్ టైన్ మెంట్ తో బాలన్స్ చేయటంలో మంచి నేర్పరి. అది నారా రోహిత్ కు దక్కిన మొదటి హిట్ సోలోలోనే బయట పడింది. అంతకు ముందు యువత సినిమా  నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. రవితేజతో చేసిన ఆంజనేయులు-సారొచ్చారు మాత్రమే లెక్క తప్పాయి. అల్లు శిరీష్ తో చేసిన శ్రీరస్తు శుభమస్తు అతని కెరీర్ లో ఫస్ట్ హిట్ గా నిలిచింది.

కథ ఏదైనా ఫామిలీతో పాటు యూత్ ని ఆకట్టుకునేలా రొమాంటిక్ స్టోరీస్ కి మాస్ టచ్ బాగా ఇస్తాడు పరశురామ్. ఇతనిలో ఉన్న ఆటిట్యూడ్ ఇదే. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోని వర్జిన్ అంటూ బుద్ధిమంతుడు అంటూ ప్రొజెక్ట్ చేయటం ఇప్పటికే యువతకు బాగా ఎక్కేస్తోంది. ఈ నేపథ్యంలో గీత గోవిందం మీద అంచనాలు మామూలుగా లేవు. ఇది కనక గట్టిగా కొట్టాడు అంటే పరశురామ్ టాప్ లీగ్ లోకి వెళ్లడమే కాదు స్టార్ హీరోల కాల్స్ అందుకోవడం కూడా ఖాయమే అనిపిస్తోంది. ఇది తేలేది ఇండిపెండెన్స్ డే రోజునే.
Tags:    
  • Director Parasuram 
  • Geetha Govindam Movie 
  • Vijay Devarakonda 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS