• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మారుతి రెండు పడ‌వ‌ల...

మారుతి రెండు పడ‌వ‌ల ప్ర‌యాణం

By - Tupaki Desk
Update: 2022-03-29 00:30 GMT
ఈ మ‌ధ్య చాలా మంది యంగ్ డైరెక్ట‌ర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే డిజిట‌ల్ ప్ర‌పంచంలో వెబ్ సిరీస్ లు కూడా చేసేస్తూ షాకిస్తున్నారు. స‌మ‌యం కుదిరితే ప్ర‌తీ ప్లాట్ ఫామ్ ని ప‌ర్‌ఫెక్ట్ గా వాడుకోవాల‌ని చూస్తున్నారు. ఈ విష‌యంలో యంగ్ డైరెక్ట‌ర్ మారుతి ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. వెండితెర‌పై బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని రెడీ చేస్తూనే ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కూడా వెబ్ డ్రామాల‌ని రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల `3 రోజెస్‌` అనే రొమాంటిక్ వెబ్ డ్రామాతో ఓటీటీలోనూ సంద‌డి మొద‌లుపెట్టేశారు.

మారుతి తొలి సారి చేసిన ఈ వెబ్ సిరీస్ రొమాంటిక్ కంటెంట్ ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ ఇచ్చిన జోష్‌తో మారుతి మ‌రో వెబ్ సిరీస్ కి రెడీ అయిపోతున్నారు. ఓ ప‌క్క సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ ల‌ని సైలెంట్ గా ప‌ట్టాలెక్కిస్తుండ‌టం విశేషం.  `3 రోజెస్‌` ఆహా ఓటీటీ కోసం చేసిన మారుతి తాజాగా ఇదే ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం మ‌రో వెబ్ సిరీస్ ని చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి `ఇంటింటి రామాయ‌ణం` అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.

ఈ వెబ్ సిరీస్ కి ఆయ‌న నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్క్రిప్ట్ విష‌యంలోనూ ఆయ‌నే బాధ్య‌త‌లు తీసుకుంటున్నారు. వ‌న్స్ స్క్రిప్ట్ ఫైన‌ల్ అయ్యాక ఈ వెబ్ సిరీస్ ని ప్రారంభంచ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చ‌క చ‌కా జ‌రుగుతున్నాయ‌ట‌. `ఆహా` కోసం మూడు వెబ్ సిరీస్ లు చేయాల‌ని మారుతి ఒప్పందం కుదుర్చుకున్నార‌ట‌. అందులో భాగంగా ఇది రెండ‌వ వెబ్ సిరీస్‌. ఈ వెబ్ సిరీస్ కు మారుతి వ‌ద్ద స‌హాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ వ్య‌క్తి దర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం మారుతి హీరో గోపీచంద్ తో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` మూవీని పూర్తి చేశారు. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మించారు. చిత్రీక‌ర‌ణ, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై చిత్ర బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. బిగ్ మూవీస్ రిలీజ్ త‌రువాత త‌మ సినిమాని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఫైన‌ల్ గా ఫిక్స‌య్యార‌ట‌. దీంతో ఇంత వ‌ర‌కు `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ తో మారుతి ఓ భారీ చిత్రం చేయ‌డానికి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.
Tags:    
  • Director Maruthi 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS