• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 'విక్రమ్‌' అసలు...

పుష్ప 'విక్రమ్‌' అసలు లేనే లేదట!

By - Tupaki Desk
Update: 2022-06-19 10:30 GMT
అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్‌ తదుపరి సినిమాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్న విక్రమ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్‌ తో తాజాగా ఒక ప్రముఖ నిర్మాత చర్చలు జరిపాడు అనేది వార్తల సారాంశం.

అల్లు అర్జున్‌ మరియు లోకేష్ కనగరాజ్ ల కాంబోలో అల్లు అరవింద్ తో కలిసి ఆ నిర్మాత సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడని.. ఆయన వద్ద లోకేష్ కనగరాజ్ యొక్క డేట్లు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అలాంటి ఏ ప్రతిపాదన కూడా అల్లు అరవింద్‌ వద్దకు రాలేదట. అంతే కాకుండా అల్లు అర్జున్‌ తో సినిమా ను లోకేష్ కనగరాజ్ చేయాలి అంటే చాలా కాలం పడుతుంది.

ఎందుకంటే ఇప్పటికే విజయ్ తో ఒక సినిమా ను లోకేష్ కన్ఫర్మ్‌ చేశాడు. ఆ తర్వాత ఖైదీ 2 సినిమాను చేసేందుకు ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ కూడా నడుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత విక్రమ్‌ 2 సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇన్ని ప్రాజెక్ట్‌ లు చేతిలో ఉండగా టాలీవుడ్‌ హీరోలతో ఈయన సినిమాలు చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు అనేది కేవలం పుకార్లే అంటూ మెగా కాంపౌండ్‌ నుండి క్లారిటీ వచ్చింది.

కేవలం అల్లు అర్జున్ తో మాత్రమే కాకుండా లోకేష్ కనగరాజ్‌ టాలీవుడ్‌ కు చెందిన పలువురు హీరోలతో సినిమాలు చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా పుకార్లే అని.. ఇప్పటి వరకు తెలుగు లో సినిమా చేసే విషయమై లోకేష్ ఏ ఒక్క స్టార్‌ తో చర్చలు జరపలేదు అనేది మీడియా వర్గాల టాక్‌. లోకేష్‌ కనగరాజ్‌ ప్రస్తుతం వరుసగా తమిళ సినిమాలకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు.

కోలీవుడ్‌ లోనే బిజీగా అది కూడా స్టార్‌ హీరోల సినిమాలు చేసే అవకాశం వస్తున్నప్పుడు తెలుగు లో చేయాల్సిన అవసరం ఏంటీ అన్నట్లుగా ఆయన ఫీల్‌ అవుతూ ఉంటాడు. ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలు పూర్తి అయిన తర్వాత తెలుగు సినిమాల గురించి ఏమైనా ఈయన ఆలోచిస్తాడేమో చూడాలి. తెలుగు లో లోకేష్‌ కనగరాజ్ సినిమా కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు.
Tags:    
  • Allu Arjun 
  • Lokesh Kanagaraj 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS