చిరంజీవిని ఇంకా తగ్గమంటున్నాడట
చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా చాలా హుషారుగా 'ఖైదీ నెం.150' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపితం అయ్యింది. అందుకే చిరంజీవి తన స్టార్ డంను కాపాడుకునేందుకు ఇంకా ఇంకా కష్టపడాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. అందుకే తన 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి'ని చేస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా సైరా చిత్రం కోసం కష్టపడుతున్న చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు.
భరత్ అనే నేను చిత్రం తర్వాత వెంటనే చిరంజీవితో సినిమాను మొదలు పెట్టాలని భావించాడు. కాని సైరా చిత్రం షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. దాంతో చిరంజీవి కోసం కొరటాల వెయిట్ చేస్తున్నాడు. మొదటగా ఈ చిత్రంను జనవరిలో ప్రారంభించాలనుకున్నారు, ఆ తర్వాత మార్చిలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనుకున్నాడు. కాని ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశముంది. సైరా చిత్రంకు ముందు చిరంజీవి చాలా వెయిట్ తగ్గాడు. సైరాలో గతంతో పోల్చితే బరువు తగ్గి కనిపించబోతున్నాడు.
సైరా సినిమా కోసం బరువు తగ్గిన చిరంజీవిని ఇంకాస్త బరువు తగ్గాలంటూ కొరటాల సూచించాడట. సైరా చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత రెండు నెలల పాటు బరువు తగ్గేందుకు టైం కూడా కొరటాల ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా చిరంజీవి కేరళ వెళ్లి మరికొంత బరువు తగ్గి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాటీ మూవీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లలో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లేదా వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.