• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విరాటపర్వంలో ఫస్ట్ హీరో...

విరాటపర్వంలో ఫస్ట్ హీరో వేరే.. తర్వాతే రానా!

By - Tupaki Desk
Update: 2020-06-08 05:55 GMT
టాలీవుడ్ లో 'నీది నాది ఒకే కథ' సినిమాతో మంచి విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఉడుగుల. తన రెండో సినిమాగా విరాటపర్వం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చాలా ఆలస్యం అయింది. లేదంటే ఈపాటికి థియేటర్లలో సందడి చేసి ఉండేది. అయితే ఇటీవలే ఈ సినిమా గురించి డైరెక్టర్ వేణు ఊడుగుల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. "నిజానికి ఈ సినిమా కథ రాసుకునే టైంలో నా మైండ్ లో హీరోగా కేవలం తమిళ హీరో కార్తీనే ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు కార్తీ కేవలం తమిళంలోనే ఎక్కువ మార్కెట్ కలిగి ఉన్నాడు. కార్తీకి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని రీజినల్ హీరో అయితే బాగుంటుందని మళ్లీ హీరో రానాను ఫిక్స్ అయ్యాను.

ఇక వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్లి రానాకి కథ చెప్తే వెంటనే ఓకే చేసి డేట్స్ ఇచ్చేసాడు. ఇక అలాగే నేను ఈ సినిమాలో ఫస్ట్ నుండి కూడా హీరోయిన్గా సాయిపల్లవినే అనుకున్నాను. వెళ్లి స్క్రిప్ట్ వినిపించగానే ఓకే చెప్పింది. నిజానికి సాయిపల్లవి నా మొదటి సినిమాలోనే చేయాల్సింది కానీ ఆ టైంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ ఇరగదీసింది. 1990ల నాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో ఫేమస్ యాక్టర్ నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరి రావు, జరీనా వాహిబ్.. ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90శాతం ముగిసిందని డైరెక్టర్ తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Tags:    
  • Virataparvam 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS