అదే లేపేస్తే NBK చేసేదేముంటుంది?

Update: 2020-05-01 05:14 GMT
సినిమా షూటింగుల‌కు గ‌డ్డు కాలం ఇప్ప‌ట్లో ముగిసేట్టు లేదు. ప్ర‌పంచంలోని ద‌రిద్ర‌మంతా సినీప‌రిశ్ర‌మ‌లకే చుట్టుకుంద‌నేది అంద‌రూ చేస్తున్న విశ్లేష‌ణ‌. అస‌లే స‌క్సెస్ రేటు లేక మూలిగే న‌క్కలా ఉండే ప‌రిశ్ర‌మ‌ మీద క‌రోనా తాటి పండు ప‌డ్డ‌ట్టు! ఏమిటో ఈ స‌న్నివేశం.

ఓవైపు కొవిడ్ 19 మ‌హమ్మారీ దేశాన్ని అన్నిమూల‌లా అల్లేస్తుంటే.. ఇలాంటి స‌న్నివేశంలో షూటింగుల‌కు అనుమ‌తులిచ్చే ప‌రిస్థితి ఉంటుందా?  ఈ ప‌రిణామం పెద్ద పెద్ద‌వాళ్ల‌కే మింగుడు ప‌డ‌డం లేదు. ఇప్ప‌టికే మ‌హేష్ .. బ‌న్ని లాంటి స్టార్ల సినిమాల షూటింగులు వాయిదాలు వేశారు. లొకేష‌న్లు మార్చార‌న్న టాక్ వినిపిస్తోంది. పూరి- దేవ‌ర‌కొండ ఫైట‌ర్ స‌న్నివేశ‌మిదే. మ‌రి అగ్ర హీరో బాల‌య్య ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఏమైనా ఉందా? అంటే.. ఛాన్సే లేద‌ని విశ్లేషిస్తున్నారు.

బాల‌య్య‌ను మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి అఘోరాగా ప్రెజెంట్ చేయాల‌ని పంతంతో ఉన్నాడు. ఎన్.బీ.కే 106 షూటింగ్ ని వేగంగా ప‌రుగులు పెట్టించాల‌ని ప్లాన్ లో ఉన్న టైమ్ లో క‌రోనా త‌రుముకొచ్చింది. అప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ - బెనార‌స్ షెడ్యూల్ ని ఖ‌రారు చేసుకుని హుషారుగా ఉన్న బోయ‌పాటికి అశ‌నిపాత‌మే అయ్యింది క‌రోనా విజృంభ‌ణ‌. అక్క‌డ బాల‌య్య అఘోరా గెట‌ప్ కి సంబంధించిన సీన్లు అన్నిటినీ తెర‌కెక్కించేయాల‌ని ప్లాన్ చేశారు. అస‌లే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 2000 పైగా క‌రోనా కేసులున్నాయి. రోజూ 70కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ల‌క్నో- కాశీ - వార‌ణాసి- బెనార‌సి అన్నిచోట్లా రెడ్ జోన్ల‌తో అట్టుడికిపోతోంది. ఇలాంట‌ప్పుడు అక్క‌డ ఎన్బీకే 106 షూటింగుకి అనుమ‌తులు ల‌భిస్తాయా? అంటే సందేహ‌మేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. తాజా ప‌రిణామంతో ఈ సినిమా క‌థ‌ను కూడా మార్చేస్తాడా?  మూవీకి ఎంతో కీల‌క‌మైన అఘోరా పాత్ర‌ను మార్చ‌గ‌ల‌రా? అన్న చ‌ర్చా మొద‌లైంది. అస‌లు బాల‌య్య ఈ స్క్రిప్టుని ఓకే చేయ‌డానికి కార‌ణ‌మైన కీల‌క‌మైన ఆ పాత్ర‌నే లేపేస్తానంటే అస‌లు ఈ సినిమాని చేస్తాడా? అన్న‌ది సందేహ‌మే. మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News