• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాక్సిడెంట్ బాధితుడికి...

యాక్సిడెంట్ బాధితుడికి బాబీ క్ష‌మాప‌ణ‌లు!

By - Tupaki Desk
Update: 2018-05-26 07:18 GMT

యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకున్న ప్ర‌ముఖ టాలీవుడ్‌ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ)కి ఊర‌ట ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది. తాజాగా, ఆ యాక్సిడెంట్ బాధితుడు హ‌ర్మీంద‌ర్ కు బాబీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగేలా క‌నిపిస్తోంది. నిన్న త‌న ఇంటికి వ‌చ్చిన‌ బాబీ....ఆ రోజు జ‌రిగిన దానికి తనకు క్షమాపణ చెప్పారని హర్మిందర్ త‌న  ఫేస్‌ బుక్ ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. దాంతోపాటు త‌న భవిష్యత్ బాగుండాలని త‌న‌ తల్లి దీవెనలు తీసుకొన్నార‌ని హ‌ర్మీంద‌ర్ పోస్ట్ చేశారు. ఈ వివాదంలో త‌న‌కు స‌హ‌క‌రించిన‌ మీడియా - సోషల్ మీడియా - స్నేహితులకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ విష‌యంలో న్యాయం జ‌రిగినందుకు చాలా సంతోషిస్తున్నానని హర్మిందర్ అన్నారు. హ‌ర్మింద‌ర్ కు బాబీ క్షమాపణ చెప్ప‌డంతో ఆయ‌న త‌న పిటిషన్ వాపసు తీసుకునే అవ‌కాశం ఉంది. దీంతో, ఈ కేసు నుంచి బాబీ బ‌య‌ట‌ప‌డేందుకు మార్గం సుగ‌మ‌మైంద‌ని తెలుస్తోంది. అయితే, హ‌ర్మీంద‌ర్ కేసు వాప‌సు తీసుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు బాబీపై ఈ నెల 21న యాక్సిడెంట్ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. 20వ తేదీ రాత్రి త‌మ కారును బాబీ ఢీకొట్టి వెళ్లిపోయాడ‌ని హైద‌రాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన హ‌ర్మీంద‌ర్ సింగ్ జుబ్లిహిల్స్ పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు. ఆ స‌మ‌యంలో బాబీ మ‌ద్యం సేవించి ఉన్నార‌ని....యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుండ‌గానే అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌ని ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని త‌న ఫేస్ బుక్ ఖాతాలో హ‌ర్మీంద‌ర్ సింగ్ పోస్ట్ చేశాడు. క‌నీసం బాబీ క్ష‌మాప‌ణ కూడా చెప్ప‌కుండా వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాత్రి జుబ్లిహిల్స్ పోలీసు స్టేష‌న్ లో బాబీ లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. తాజాగా, బాధితుడు హ‌ర్మింద‌ర్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో ఆయ‌న ఈ కేసు వాప‌సు తీసుకునే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    
  • Director Bobby 
  • Harmender Singh 
  • Hit And Ran Case 

Similar News

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS