ఓవైపు డైరెక్షన్.. మరోవైపు ప్రొడక్షన్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే.. ప్రొడక్షన్ లోకి దిగి నిర్మాతలుగా కూడా మారారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్న దర్శకులలో చాలా వరకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఓ వైపు పెద్ద సినిమాలతో దర్శకులుగా రాణిస్తూనే.. మరోపక్క నిర్మాతగా చిన్న మీడియం బడ్జెట్ సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి 'విశ్వామిత్ర క్రియేషన్స్' అనే బ్యానర్ ను స్థాపించి 'యమదొంగ' చిత్రాన్ని నిర్మించారు. అయితే ఎందుకో జక్కన్న ఈ బ్యానర్ లో మరో సినిమా చేయలేదు.
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ 'గుణ టీమ్ వర్క్స్' అనే బ్యానర్ స్థాపించి 'రుద్రమదేవి' సినిమా రూపొందించారు. ఇప్పుడు సమంత తో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల 'అమిగోస్ క్రియేషన్స్' బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. 'డాలర్ డ్రీమ్స్' 'ఆనంద్' 'గోదావరి' 'హ్యాపీ డేస్' 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' 'ఫిదా' వంటి సినిమాలను శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. మధ్య అనీష్ కురువిల్లా ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'ఆవకాయ్ బిర్యానీ' అనే సినిమా తీశాడు. ప్రస్తుతం తన నిర్మాణ భాగస్వామ్యంతో నాగచైతన్య తో 'లవ్ స్టొరీ' సినిమా చేస్తున్నారు కమ్ముల శేఖర్.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు చేశారు. 'పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్' మరియు 'పూరీ కనెక్ట్స్' అనే రెండు బ్యానర్స్ పై చార్మీ కౌర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తో బ్లాక్ బస్టర్ అందుకొని ప్రస్తుతం 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలానే తనయుడు పూరీ ఆకాష్ 'రొమాంటిక్' అనే సినిమా తీస్తూ.. ఆయన శిష్యుడు అనిల్ పాదూరి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు పూరీ. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరీ సమకూరుస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ కూడా ప్రొడ్యూసర్ గా మారి 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేయడంతో పాటుగా.. ఇతర టాలెంటెడ్ యంగ్ స్టర్స్ కి తన బ్యానర్ లో అవకాశం కల్పిస్తున్నాడు. ఇప్పటికే 'కుమారి 21F' 'దర్శకుడు' 'ఉప్పెన' వంటి సినిమాలను నిర్మించాడు సుకుమార్. ప్రస్తుతం తాను స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తూ నిఖిల్ తో '18 పేజెస్' సినిమా రూపొందిస్తున్నాడు. అలానే సాయి తేజ్ తో ఓ మిస్టికల్ థ్రిల్లర్.. కార్తికేయ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు.
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కెరీర్ ప్రారంభం నుంచి కూడా తాను తీసే సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూనే వస్తున్నారు. ఈ క్రమంలో పలు అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై '101 జిల్లాల అందగాడు' అనే సినిమా ని నిర్మిస్తున్నారు క్రిష్. రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలానే స్వీయ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రతి సినిమా కూడా తన 'కంపెనీ' లోనే నిర్మిస్తుంటారు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ సొంత బ్యానర్ 'చిత్రం మూవీస్' ద్వారా ఎంతో మంది న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు 'చిత్రం 1.1' సినిమా చేస్తున్నారు తేజ. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'సరెండర్2 సినిమా' బ్యానర్ పై అఖిల్ అక్కినేని హీరోగా 'ఏజెంట్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా ఇటీవలే 'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'స్వప్న సినిమాస్' బ్యానర్ పై మరికొన్ని సినిమాలను నిర్మించడానికి నాగ్ అశ్విన్ రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు మరికొందరు దర్శకులు సొంత బ్యానర్లను స్థాపించి సినిమాలను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి.. దానిపై సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. కొందరు అప్ కమింగ్ టాలెంటెడ్ దర్శకులతో స్క్రిప్టులు సిద్ధం చేయస్తున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే దీని గురించి అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. అలానే ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ కూడా ఇదే స్ట్రాటజీను ఫాలో అవ్వాలనుకుంటున్నారని సమాచారం.