ఆ కిడ్నాప్ లో తనకు భాగం లేదన్న హీరో

Update: 2017-02-23 06:30 GMT
మలయాళీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి తగ్గడం లేదు. ఈ కేసులో వినిపిస్తున్న పేర్లు ఇండస్ట్రీకే షాకింగ్ మారాయి. దీంతో కొంతమంది సీనియర్లు తమకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది. తాజాగా సీనియర్ మలయాళ నటుడు దిలీప్.. భావన కిడ్నాప్ ఉందతంలో తనకు ఎలాంటి భాగం లేదంటూ.. సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నాడు.

ఈ సంఘటన పట్ల తాను కూడా సిగ్గు పడుతున్నానన్న దిలీప్.. మలయాళ పరిశ్రమపైనే మచ్చ ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు. ఈ కేసులో నేరం ఆరోపించబడిన వారిలో ఎవరితోనూ తనకు ప్రత్యక్ష.. పరోక్ష సంబంధాలు లేవంటూ వివరించాడు దిలీప్. ప్రస్తుతం ఛానల్స్ వస్తున్న కథనాలు అన్నీ అసత్యం అన్న దిలీప్.. తనపై ఇలాంటివి ప్రచురిస్తున్న.. ప్రసారం చేస్తున్నవారందరూ తమ దగ్గరున్న ఆధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. ఫ్యామిలీ రిలేషన్స్ కి విలువ ఇస్తానని.. తల్లి.. కూతురు.. భార్య ఉన్న తాను ఇలాంటి దారుణానికి ఒడిగట్టలేదని చెప్పాడు. పోలీసులు కూడా దిలీప్ పేరును ఇప్పటివరకూ చెప్పలేదు.

అయితే.. ఈ కేసులో దిలీప్ పేరు వినిపించడానికి కారణాలున్నాయి. ఆమె కెరీర్ కొత్తలో దిలీప్ తో భావనకు విబేధాలు వచ్చాయి. ఆమె కెరీర్ కి ఇబ్బంది కలిగించేందుకు దిలీప్ ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడిలా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News