• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజు లెక్క.. 22...

దిల్ రాజు లెక్క.. 22 హిట్లు.. ఐదు ఫ్లాపులు

By - Tupaki Desk
Update: 2018-07-15 06:50 GMT
దిల్ రాజు.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయిన ఈ రోజుల్లో.. ఇప్పటికీ బేనర్ వాల్యూను కాపాడుకుంటూ.. తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ సంపాదించుకుని.. వరుసగా సినిమాలు నిర్మిస్తూ సాగిపోతున్న ప్రొడ్యూసర్. ఓవైపు స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు తీస్తూనే.. మరోవైపు చిన్న హీరోలతో లో-మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తుంటాడు రాజు. ఆయన్నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘లవర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ మీదే తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాజు అన్న కొడుకు హర్షిత్ రెడ్డి నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజు.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నాడు. తన బేనర్‌ కు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడాయన ఈ ఈవెంట్లో.

తమ సంస్థలో అన్ని రకాల చిత్రాలూ చేశామని.. ఇందులో చేసిన లో బడ్జెట్ సినిమాల్లో ఇది మూడోదని రాజు చెప్పాడు. ‘కేరింత’ తీశాక చాలా గ్యాప్ తీసుకుని దాని లాగే తక్కువ బడ్జెట్లో ఈ చిత్రం తీశామన్నాడు. ఇప్పటిదాకా తమ సంస్థ నుంచి 27 సినిమాలు వచ్చాయని.. అందులో 22 విజయవంతం అయ్యాయని.. అందులో సూపర్ హిట్లతో పాటు బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయని రాజు తెలిపాడు. మిగతా ఐదు సినిమాల విషయంలో మాత్రం తమ జడ్జిమెంట్ దెబ్బ తిందన్నాడు. తమ సంస్థ నుంచి వస్తున్న 28వ సినిమా ఈ నెల 20న రిలీజై కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని ధీమాగా చెబుతున్నానని రాజు చెప్పాడు. ‘లవర్’ ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉండి.. జనాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయని.. ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంటోందని రాజు చెప్పాడు. నిజానికి తన సినిమాల విషయంలో గట్టిగా విమర్శించే ఒక వ్యక్తికి ముందు ‘లవర్’ సినిమాపై ఆసక్తి లేదని.. కానీ ట్రైలర్ చూశాక అతను ఫోన్ చేసి ఇందులో ఏదో విశేషం ఉందని.. సినిమా చూడాలన్న ఆసక్తి పుట్టిందని తనతో అన్నాడని.. అదే ‘లవర్’ విషయంలో సక్సెస్ అనుకుంటున్నానని రాజు తెలిపాడు.
Tags:    
  • Dil Raju 
  • Lover Movie 
  • Telugu News 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS