దిల్ రాజు లెక్క తప్పుతోందా ?
సినిమాల ఫలితాలను అంచనా వేయడంలో డిస్ట్రిబ్యూషన్ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా పేరున్న దిల్ రాజుకు ఈ మధ్య అదే రంగం అంతగా అచ్చి వస్తున్నట్టు లేదు. బ్యానర్ మీద నిర్మిస్తున్న సినిమాలు మంచి ఫలితాలనే ఇస్తున్నప్పటికీ పంపిణి హక్కులు కొనుక్కుని చేస్తున్న ఇతర నిర్మాతల సినిమాలు అంతగా వర్క్ అవుట్ కావడం లేదని ఇన్ సైడ్ టాక్. ఈ కారణంగానే బడా సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొంత ఆలోచిస్తున్నారనే గాసిప్ ఇప్పుడు గుప్పుమంటోంది.
సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిశ్రమలో ఇలా ఆలోచించడంలో ఆశ్చర్యం ఏమి లేదు కానీ ఎక్కడ లెక్క తప్పుతోంది అనే విశ్లేషణలో దిల్ రాజు సీరియస్ గా ఉన్నారట. సరే జయాపజయాలు ఇక్కడ సహజమే కాబట్టి తర్వాతైనా సెట్ కావొచ్చని అనుకోవడం సహజం. అయితే నిన్న ఓ చిన్న సినిమాను కొన్న దిల్ రాజు టీమ్ అదేదో భారీ క్రేజీ వెంచర్ లా ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేయడం గురించి అంతర్గతంగా గుసగుసలు రేగాయి.
ఇదేమి తప్పు కాదు కానీ అసలు పేరే ఎవరికి తెలియని సినిమాకు ఇలా చేయడం ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో ఇదే త్వరలో వెళ్ళిపోమాకే అనే సినిమాను కొన్న దిల్ రాజు ఆ తర్వాత దాన్ని ఓ వారం కూడా నిలపలేక యూట్యూబ్ లో వదిలేయడం ఈ సందర్భంగా గుర్తుకురావడం గమనార్హం. సురేష్ సంస్థ తరహాలో చిన్న సినిమాలకు బ్యాక్ అప్ ఇచ్చి ఎక్కువ రెవిన్యూ రాబట్టే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్టు మరో టాక్ ఉంది. మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ పరంగా టైం అంతగా కలిసిరావడం లేదన్న వాస్తవమైతే కళ్ళముందు కనిపిస్తోంది