• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజుది ఓవర్...

దిల్ రాజుది ఓవర్ కాన్ఫిడెన్సా!

By - Tupaki Desk
Update: 2017-01-11 06:04 GMT
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’.. నందమూరి బాలకృష్ణ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రేసులో ఉన్నాయని తెలిసినా దిల్ రాజు తగ్గలేదు. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘శతమానం భవతి’ని పండక్కే రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యాడు. సినిమా మీద ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. చిరు.. బాలయ్య సినిమాల సంగతి తేలాక ప్రేక్షకులు ఆటోమేటిగ్గా ‘శతమానం భవతి’ వైపు కూడా ఆసక్తి చూపిస్తారని.. తన సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసినట్లున్నారు.

కానీ ప్రస్తుతానికైతే ‘శతమానం భవతి’ గురించి జనాలు ఆలోచించే పరిస్థితే లేదు. దిల్ రాజుకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు ప్రమోషన్లు బాగా చేయాల్సింది. కానీ అవేమీ పెద్దగా కనిపించట్లేదు. సినిమా అసలు వార్తల్లోనే లేదు. ఎక్కడ చూసినా చిరు - బాలయ్యలే సందడి చేస్తున్నారు. వాళ్ల సినిమాలకు సంబంధించిన వార్తలే మీడియాలో కనిపిస్తున్నాయి. చిరు-వినాయక్.. బాలయ్య-క్రిష్ మీడియాలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలిస్తున్నారు. కానీ ‘శతమానం భవతి’కి సంబంధించి ఎవరూ మీడియాతో మాట్లాడట్లేదు. మీడియాలో పెద్ద కవరేజీ ఉండట్లేదు. పబ్లిసిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయంలో దిల్ రాజు ప్లాన్ ఏమంత బాగా లేదంటున్నారు.

సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ లో బజ్ వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని.. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకుండా రిజల్ట్ కూడా తేడా కొట్టేస్తుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే దిల్ రాజు మాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజయ్యాక తర్వాతి రోజుకు జనాల ఆలోచనలు సాధారణ స్థితికి వస్తాయని.. అప్పుడు సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అయిన ‘శతమానం భవతి’ మీద దృష్టిపెడతారని.. సినిమా కచ్చితంగా జనాల్లోకి వెళ్తుందని నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • DIl Raju 
  • Shatamanam Bhavati Movie 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS