మెగా హీరోను కలిసిన డై హార్డ్ ఫ్యాన్స్.. కాలినడకన వెళ్లి మరీ..!

Update: 2021-06-25 14:30 GMT
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద అభిమానం విషయంలో ఫ్యాన్స్ ఎంత దూరమైనా వెళ్తారు. ఆఖరికి ఒకరినొకరు ప్రేమించుకునే వారు కూడా అభిమానం విషయంలో చంపుకునే వరకు వెళ్తుంటారు. అంటే తమ అభిమాన హీరోలపై ఉండే అమితమైన ప్రేమభిమానం అదే అని చెప్పవచ్చు. నిజానికి ఫ్యాన్స్ అనేవారు ప్రతి యేటా తమ ఫేవరేట్ హీరోల బర్త్ డేలను ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తుంటారో మనం చూస్తూనే ఉంటాం. కానీ తమ అభిమాన హీరోను కలవడానికి ఎక్కడో చిన్న మారుమూల గ్రామం నుండి పట్టణానికి కాలినడకన వెళ్లే వీరాభిమానులను అరుదుగా చూస్తుంటాం. అలాంటి వారినే లోకం డై హార్డ్ ఫ్యాన్స్ అని పిలుస్తుంది.

అలాంటి అభిమానులు ప్రతి హీరోకు ఉంటారు. అలాగే అప్పుడప్పుడు హీరోలను కలవడానికి వెళ్లి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ముగ్గురు మెగా పవర్ స్టార్ అభిమానులు తాజాగా వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ తేజ్ డై హార్డ్ ఫ్యాన్స్ అయినటువంటి సంధ్య జైరాజ్ - రవి - వీరేష్.. వీరు ముగ్గురు వేరే హీరోల ఫ్యాన్స్ నుండి స్ఫూర్తి పొంది మెగా హీరోను కలవడానికి హైదరాబాద్ చేరుకున్నారు. వీరు ముగ్గురు కూడా జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందినవారుగా తెలుస్తుంది. జూన్ 20న కాలినడకన జైరాజ్ రవి వీరేష్ హైదరాబాద్ బయలుదేరారు.

జూన్ 24న అంటే నాలుగు రోజులకు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు చేరుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న రాంచరణ్ అభిమానులను ఇంటికి ఆహ్వానించి కలవడం జరిగింది. వారిని ఆలింగనం చేసుకొని ఒక గంటసేపు మాట్లాడి వారితో సెల్ఫీలు దిగి పంపించినట్లు సమాచారం. మొత్తానికి మెగాహీరో మెగా హృదయం కలిగి ఉన్నాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో ప్రెస్టిజియస్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా ఆర్ఆర్ఆర్ సిద్ధం అవుతోంది. అలాగే చరణ్ తదుపరి సినిమా డైరెక్టర్ శంకర్ తో లైనప్ చేసాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
Tags:    

Similar News