• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన్ స్టాపబుల్ లో పవన్ తో...

అన్ స్టాపబుల్ లో పవన్ తో బాలయ్య తీరును గమనించారా?

By - Tupaki Desk
Update: 2023-01-21 08:02 GMT
నందమూరి బాలక్రిష్ణ టాక్ షో చేయటమా? ఆ మాటే కొత్తగా అనిపించేలా చేసింది. ఎలా ఉంటుందన్న ఉత్సుకతను రేపింది. అందరికి తెలిసినట్లుగా భావించే బాలక్రిష్ణకు.. సదరు టాక్ షోలో బాలయ్యకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండటమే కాదు.. ఆయనలోని కొత్త కోణాల్ని ఆవిష్కరించింది అన్ స్టాపబుల్. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ షోకు ఉన్నంత ఆదరణ అంతా ఇంతా కాదు.

ఈ మధ్యన డార్లింగ్ ప్రభాస్ తో చేసిన షో ను స్ట్రీమ్ చేసిన రోజున.. వచ్చి పడిన ట్రాఫిక్ తో 'ఆహా' ఒక్కసారిగా షేక్ కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా 'ది బాప్ ఆఫ్ అల్ టాక్ షోస్' అయిన అన్ స్టాపబుల్ బాలయ్యతో.. 'ది బాప్ ఆప్ ఆల్ ఎపిసోడ్స్' గా అభివర్ణిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేసిన షో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మిగిలిన ఎపిసోడ్స్ విషయంలో వచ్చిన గెస్టుతో బాలయ్య మాట్లాడిన తీరుకు.. తాజాగా పవన్ కల్యాణ్ తో చేసిన ఎపిసోడ్ లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు ఉన్న తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఏ గెస్టుతో అయినా సరే.. తన మార్క్ ను ప్రదర్శించే బాలయ్య.. పవర్ స్టార్ విషయంలో మాత్రం ఆచితూచి అన్నట్లు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా గెస్టు ఎవరైనా సరే.. 'నువ్వు' అంటూ ఏకవచనంలో మాట్లాడే బాలయ్య.. పవన్ తో మాత్రం 'మీరు' అంటూ మాట్లాడటం కనిపిస్తుంది.

బాలక్రిష్ణ ఏకవచనంలో మాట్లాడటం తప్పు అని అనటం లేదు. ఒక సీనియర్ నటుడిగా.. భారీ బ్యాగేజ్ ఉన్న ఆయన మాట్లాడే తీరును వేలెత్తి చూపటం ఇక్కడ మా ఉద్దేశం కాదు. ఇక్కడ చెప్పదలుచుకుంటున్నది పవన్ తో చేసిన షోలో బాలయ్య మాటలోనూ.. బాడీ లాంగ్వేజ్ లోనూ వచ్చిన తేడాను మరింత అర్థమయ్యేలా చెప్పటం మాత్రమే ఇక్కడ ఉద్దేశం.

అంతేకాదు.. ఏ ప్రశ్నను అయినా సరే ఫన్ పండించేలా మాట్లాడిన బాలయ్య.. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో మాత్రం.. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడటం కనిపిస్తుంది.

ఏమైనా.. పవన్ స్థాయి.. స్టామినా ఏమిటన్నది తెలిసేలా  అన్ స్టాపబుల్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ ను రెగ్యులర్ గా చూసే వారికి బాలయ్య మాట తీరు.. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇట్టే చెప్పేస్తారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ విషయంలో మాత్రం తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం మరింత బాగా అర్థమవుతుందని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • NandamuriBalakrishna 
  • TalkShow 
  • PowerStarPawanKalyan 
  • BaapOfAllTalkShow 
  • Balayya 
  • MovieNews 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS