విక్రమ్ సినిమా కోసం ఇన్నేళ్లు పట్టిందా?
విలక్షణ చిత్రాలతో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో చియాన్ విక్రమ్. గత కొంత కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ ట్రాక్ లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా విక్రమ్ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తనయుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి `మహాన్` మూవీలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. కానీ క్రేజ్ కి తగ్గట్టుగా ఆశించిన ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది.
ఈ మూవీ తరువాత విక్రమ్ తనదైన పంథాలో విభిన్నమైన కథతో చేస్తున్న చిత్రం `కోబ్రా`. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధి శెట్టి, మియా జార్జ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వయాకమ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తోంది.
సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో విక్రమ్ 25 డిఫరెంట్ గెటప్ లలో కనిపించనుండటం వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలవబోతోంది. గత మూడేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా కంప్లీట్ అయింది.
ఇదే విషయాన్ని దర్శకుడు జ్ఞానముత్తు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ షూటింగ్ ఆన్ లొకేషన్ లో హీరో విక్రమ్ టీమ్ తో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోలని అభిమానులతో పంచుకున్నారు.
మొత్తానికి షూటింగ్ పూర్తయింది. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న షూటింగ్ కి ఈ రోజుతో ఎండ్ పడింది. ఈ సందర్భంగా విక్రమ్ సర్ కి నా సిన్సియర్ థాంక్స్. నన్ను విశ్వసించి నాతో అన్ని కష్టాలు, కష్టసమయాల్లో నాతో కలిసి ప్రయాణించిన నా టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోబ్రా విజన్‌ని నమ్మిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి వుంటారు` అని ట్వీట్ చేశారు.
గత కొంత కాలంగా పర్ ఫెక్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ఈ మూవీ కోసం చాలానే శ్రమించారు. అంతే కాకుండా ఈ మూవీ ఫలితంపై భారీ అంచనాలు పెట్టుకున్నారట.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. విక్రమ్ ఆశిస్తున్నట్టే ఈ మూవీ అతని కెరీర్ ని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.