ఉత్తరాఖండ్ విలయానికి ఆ తప్పులే కారణం - దియా మీర్జా
ఉత్తరాఖండ్ ను మరోసారి వరద బీభత్సం ముంచెత్తిన విషయం తెలిసిందే. మంచు చరియలు విరిగిపడి గంగానది ఉపనది అయిన ధౌలి గంగ పోటెత్తింది. ఈ వరద ధాటికి ఒక పవర్‌ప్రాజెక్ట్ మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు.
ఈ పెను విషాదంపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ ఉత్పాతంపై పలువురు సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. దియా మిర్జా మాత్రం ఆవేదనతోపాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. మనుషులు చేస్తున్న తప్పిదాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాపోయింది. ఈ ప్రకృతి విలయానికి మనుషులే కారణమని నిందిస్తోంది దియా.
‘హిమాలయాల్లో చెట్లను కొట్టేయడం, కొండలను తొలిచేయడం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఆనకట్టలు, పవర్ ప్రాజెక్టులు నిర్మించడం వంటివన్నీ పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయి. అందుకే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. అవి అమాయకుల ప్రాణాలు బలిగోరుతున్నాయి’ అని దియా మిర్జా తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది.
కాగా.. గతంలోనూ చాలాసార్లు పర్యావరణం గురించి మాట్లాడింది దియా. ‘గతంలో బర్త్ డే ఎవరిదైనా వస్తే.. ఏం బహుమతి ఇవ్వాలా అని నేను తెగ హైరానా పడేదాన్ని. కానీ.. ఆ తర్వాత బహుమతులు ఇవ్వట్లేదు. ఎవరిదైనా పుట్టినరోజు ఆహ్వానం నాకు అందితే.. వారి పేరు మీద 11 చెట్లు నాటుతున్నాను. ఆ తర్వాత వారిని వెళ్లి ఆ చెట్లు నాటిన స్థలాన్ని చూసి రమ్మని చెబుతున్నాను. ఆ విధంగా.. ఒక సంవత్సరంలో నేను దాదాపు 18 వేల చెట్లు నాటాను’ అని ఇదివరకు చెప్పింది దియా మీర్జా.