తండ్రి తో యుద్ధానికి సిద్ధం అవుతున్న తనయుడు!!

Update: 2020-07-04 08:00 GMT
విలక్షణ స్టార్ హీరో విక్రమ్‌, టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజు కలయికలో విక్రమ్ 60వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కూడా నటిస్తుండటం విశేషం. ఇటీవలే ‘అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’ సినిమాతో ధృవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తండ్రితో కలిసి ధృవ్‌ సినిమా చేయబోతుండటం కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వినూత్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్‌, ధృవ్‌ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని సమాచారం. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ పూర్తిగా ముగిసాక రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారు. ఇది మాఫియా నేపథ్యంలో రూపొందుతుందట. అయితే ఇందులో ఒక కీలకమైన ట్విస్ట్ గురించి ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాlo విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని.. ధృవ్ పాజిటివ్ యాంగిల్ లో ఉంటూ తండ్రితో సై అంటే సై అనే రీతిలో టెర్రిఫిక్ సీన్స్ ఉంటాయని సమాచారం. డైరెక్టర్ ఆ సన్నివేశాలను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. విక్రమ్ వారసుడిగా తెరంగేట్రం కన్నా ముందే ధృవ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఒరిజినల్ వెర్షన్ అంత గొప్ప విజయం సాధించకపోయినా ఆదిత్యవర్మ నిరాశపరచలేదు. ఇక ప్రస్తుతం తండ్రితో పోటీ పడటానికి ధృవ్ బాడీని పెంచే పనిలో పడ్డాడు. ఇటీవలే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ షేర్ చేశారు. కండలు తిరిగిన వీరుడిలా ధృవ్ కనిపించడం విశేషం. చూడాలి మరి తండ్రితో ఏ రేంజ్ లో పోటీపడనున్నాడో..!
Tags:    

Similar News