మన స్టార్స్ కు ఏమాత్రం తగ్గని ధనుష్‌

Update: 2021-09-22 11:30 GMT
సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలు టాలీవుడ్‌ హీరోలు అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా నిర్మాతలు పెట్టే ఖర్చు.. ఇచ్చే పారితోషికాలు బాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. సూపర్ స్టార్స్ మరియు ఇతర స్టార్స్ అంతా కూడా భారీగా పారితోషికాలు తీసుకుంటూ ఉంటారు... అదే స్థాయిలో వారు నటించిన సినిమాల వసూళ్లు కూడా ఉంటాయి. టాలీవుడ్‌ సినిమాలకు మంచి గిరాకీ ఉంది కనుకే బాలీవుడ్ స్టార్స్ నుండి ఇతర స్టార్స్ అంత కూడా తెలుగు లో నటించేందుకు సిద్దంగా ఉంటున్నారు. బాలీవుడ్‌ రేంజ్ లో పారితోషికాలు ఇస్తున్న టాలీవుడ్‌ నిర్మాతలు ఈమద్య కాలంలో వరుసగా కోలీవుడ్‌ హీరోలను తెలుగు లో నటింపజేస్తున్నారు. తెలుగు మరియు తమిళంలో సినిమాలను చేయడం వల్ల భారీగా వసూళ్లు నమోదు అవుతాయి.. పాన్ ఇండియా మూవీస్ గా విడుదల చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో భారీ ఎత్తున పారితోషికాలు ఇస్తున్నారు. మన స్టార్స్ తో సమానంగా తమిళ స్టార్‌ ధనుష్ నటించబోతున్న తెలుగు సినిమాకు భారీ పారితోషికంను అందుకోబోతున్నాడు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ నటించబోతున్న తెలుగు తొలి సినిమాకు గాను 50 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. తమిళం మరియు తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తారు కనుక భారీ మొత్తంలో సినిమా వసూళ్లు దక్కించుకోవడం.. ఇతర బిజినెస్ ల ద్వారా కూడా భారీ మొత్తంలో నిర్మాతలకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం ధనుష్‌ కు రూ.50 కోట్లకు పైగా పారితోషికంను ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. ఏషియన్ మూవీస్ వారు ఈ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కోసం తెలుగు తమిళ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక సాదా సీదా ఫ్యామిలీకి చెందిన ధనుష్‌ కోలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోగా దూసుకు పోతున్నాడు. హాలీవుడ్‌ లో కూడా నటిస్తున్న ధనుష్‌ ఆస్తుల విలువ దాదాపుగా రూ.180 కోట్లు ఉంటుందని అంచనా. ధనుష్ కు స్థిర మరియు చర ఆస్థులు చాలానే ఉన్నాయి. అత్యధిక రేటు ఉండే లగ్జరీ కార్ల కలెక్షన్‌ ధనుష్‌ వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు. ఐదు ఖరీదైన కార్లు మరియు అత్యంత ఖరీదైన ఏరియాలో ఇల్లు ఇంకా వాణిజ్య సముదాయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అనఫిషియల్‌ గా ధనుష్ ఆస్తుల విలువ 350 కోట్లకు పైగానే ఉంటుంది అనేది కోలీవుడ్‌ వర్గాల టాక్‌. టాలీవుడ్‌ హీరోలు భారీ స్థాయిలో ఆస్తులు ఆదాయాలను కలిగి ఉంటారు. మన హీరోల రేంజ్ లో ఇప్పుడు ధనుష్ కూడా పారితోషికం అందుకుంటూ ఉన్న నేపథ్యంలో ముందు ముందు అయిదు వందల కోట్ల వరకు ఆస్తులు పెంచుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News