• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోయిన్ ను మళ్ళీ...

ఆ హీరోయిన్ ను మళ్ళీ తెస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2016-12-10 19:30 GMT
హీరోలుగా ట్రై చేసి టాప్ పోజిషన్ ను అందుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. వన్స్ హీరో రోల్ లో ఫిక్సైన తర్వాత ఇక అక్కడే ఆగిపోతారు. అప్పుడప్పుడు డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో కాళ్లూ.. వేళ్లూ పెట్టినా అఫిషియల్ గా మెగాఫోన్ పట్టుకోడానికి మాత్రం భయపడిపోతారు. కొంతమంది మాత్రమే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నా ప్రయోగాలు కూడా చేస్తుంటారు. తమిళ్ హీరో ధనుష్ ఇప్పుడు ఇలాంటి ఎక్స్ పర్మెంట్సే చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా కంటిన్యూ అవుతూనే.. డైరెక్టర్ క్యాప్ కూడా పెట్టుకొన్నాడు.

హీరోగా ధనుష్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. అయితే ముందు నుంచి ధనుష్ టార్గెట్ మాత్రం డైరెక్షనే. యాక్టర్.. సింగర్.. లిరిసిస్ట్.. రైటర్ అంటూ సినిమాకి సంబంధించి దాదాపు అన్ని ప్రధాన విభాగాల్లో సత్తా చాటిన రజనీ అల్లుడు ప్రస్తుతం పవర్ పాండి అంటూ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీఎంట్రీలో అదరగొడ్తోన్న అలనాటి నటుడు రాజ్ కిరణ్ ని హీరోగా పెట్టడమే షాకంటే.. జనాలు మర్చిపోయిన ఆర్టిస్ట్ ల్ని మళ్లీ తన మూవీలోకి తీసుకోవడం ఇంకో సర్ ప్రైజ్.

ధనుష్ రేంజ్ మార్చిన తిరుడా తిరుడిలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఛాయా సింగ్ కు కూడా రోల్ ఆఫర్ చేశాడు. చాలామందిని అబ్జర్వ్ చేసిన తర్వాతే ఈ కేరెక్టర్ కి ఛాయాసింగ్ ను తీసుకున్నారట. ఎప్పుడో 2003లో వచ్చింది తిరుడా తిరుడి. మన్మధ రాసా అంటూ ధనుష్- ఛాయాసింగ్ వేసిన స్టెప్స్ జనాలకి ఇంకా గుర్తున్నాయ్. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్లద్దరూ ఒకే మూవీలో కనిపిస్తుండటంతో పవర్ పాండి మీద క్యురియాసిటీ పెరిగిపోతుంది. యాజ్ యుజువల్ గానే చూశారా మా హీరో ఎవర్ని మర్చిపోలేదు.. అందర్ని గుర్తుపెట్టుకోనే మంచి మనసంటూ ధనుష్ ఫ్యాన్స్ అప్పుడే లిఫ్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేశారు. అన్నట్టు ధనుష్ కూడా తన మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు.
Tags:    
  • Dhanush 
  • Raj Kiran 
  • Telugu News 
  • Chaya Singh 

Similar News

ఎన్నేళ్లు గడిచినా వర్మ మారలేదు..ఇప్పటికీ అదే తిరుగుబాటు!

2026-11-25 07:08 GMT

తెలంగాణ యాస..1960ల నాటి కొత్త ప్రపంచం!

2026-11-25 07:08 GMT

నారా రోహిత్‌.. నవంబర్‌ ఎంత స్పెషల్ అంటే..

2026-11-25 07:07 GMT

అందాల పోటీల్లో కొత్త చరిత్ర.. కేరళ అమ్మాయి అరుదైన ఘనత!

2026-11-25 07:07 GMT

చంద్రబోస్ ఇంట్లో తరుణ్ భాస్కర్‌కు స్పెషల్ ఫ్యాన్!

2026-11-25 07:05 GMT

అంతరిక్షం కంటే ముందు 150 కాఫీ షాప్‌లకు వెళ్లిందట..!

2026-11-25 07:05 GMT

ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!

2026-11-25 06:04 GMT

పవన్ కళ్యాణ్‌తో గత జీవితం.. సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణు దేశాయ్

2026-11-25 06:04 GMT

టాలెంట్ ఉందంటారు.. మరి ఛాన్స్ ఎందుకివ్వరు!

2026-11-25 06:04 GMT

రాజమౌళి కొడుక్కి తెలుగు టైటిల్ దొరకలేదా..?

2026-11-25 06:03 GMT

ఎలిగెంట్ లుక్‌లో ఆకట్టుకున్న నమ్రతా శిరోద్కర్

2026-11-25 05:14 GMT

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

Copyright @2026

Powered by Blink CMS