• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధ‌మాకా ట్రైల‌ర్: కోట్ల‌లో...

ధ‌మాకా ట్రైల‌ర్: కోట్ల‌లో ఒక‌డాడు కొడితే కోలుకోలేవు!

By - Tupaki Desk
Update: 2022-12-15 14:40 GMT
వైజాగ్ ఫ్యాక్ట‌రీలో 1000 మందికి ఉద్యోగాలివ్వాలి! .. ఇందులో చాలా కాన్సెప్ట్ కంటెంట్ క‌నిపిస్తోంది. ఈ ఒక్క డైలాగ్ తో మాస్ యాక్ష‌న్ `ధ‌మాకా` మోగించాడు రాజా! రవితేజ స్ట్రైక్స్ ఎగైన్! అనిపించే మ‌సాలా ఎంట‌ర్ టైనర్ తో బ‌రిలో దిగుతున్నాడ‌ని హింట్ అందింది. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన రెండు విభిన్న షేడ్స్ ఉన్న‌ పాత్రల్లో నటిస్తున్న `ధమాకా` ట్రైలర్ తాజాగా విడుదలైంది. త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. బెజవాడ ప్రసన్నకుమార్ ర‌చ‌యిత‌. ఈ జోడీ ప‌ర్ఫెక్ట్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో వినోదాత్మ‌క కంటెంట్ ని వండి వార్చడంలో సుప్ర‌సిద్ధులు. `ధమాకా` మరో వినోదాత్మక చిత్రం అవుతుందని ట్రైలర్ చెబుతోంది. మాస్ రాజా బాడీ లాంగ్వేజ్ టింజ్ కి త‌గ్గ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ఇందులో ఒక‌రు క్లాస్ మొరొక‌రు మాస్.. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు ఎంత వినోదం పంచుతార‌నేది తెర‌పైనే చూడాలి. ద్విపాత్రాభినయం కోసం రవితేజ రూపాల‌ను మార్చుకుని క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రిలో ఒక‌రు ఆహ్లాద‌క‌రంగా క‌నిపిస్తే.. ఇంకొక‌రు మాత్రం తుఫాన్ లా భీభ‌త్సం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

అలాగే ఈ మూవీలో త్రినాథ‌రావ్ బ్రాండ్ డైలాగుల‌కు కొద‌వేమీ లేదు. కోట్ల‌లో ఒక‌డాడు కొడితే కోలుకోలేరు..! అంటూ సీరియ‌స్ డైలాగ్ ఓ వైపు.. త్రివిక్ర‌మ్ మీ చుట్ట‌మా స‌ర్.. ? అంటూ కామెడీ టింజ్ మ‌రోవైపు... ఇలా మాస్ ని మురిపించే డైలాగుల‌కు కొద‌వేమీ లేదు. ``నేను వెనుకున్న‌వాళ్లు చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.. వెన‌క ఎవ‌రూ లేక‌పోయినా ముందు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని!`` అంటూ భారీ ఎమోష‌న‌ల్ డైలాగులు ఆక‌ట్టుకున్నాయి.

ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. జైరామ్ -త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ట్వంటీ ఏజ్ గాళ్ శ్రీ‌లీల‌ తో మాస్ రాజా రొమాన్స్ కూడా ట్రైల‌ర్ లో ఒక రేంజులో మురిపిస్తోంది.  భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన `ధమాకా` డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    
  • Dhamaka 
  • Movie 
  • Trailer 
  • RaviTeja 
  • Sreeleela 
  • latestnews 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS