దేవిశ్రీ పని అయిపోయినట్లేనా

Update: 2019-01-12 17:30 GMT
దేవిశ్రీప్రసాద్.. ఇది కేవలం ఓ పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. దేవిశ్రీ ఉంటే సినిమా వెయిట్ పెరుగుతుంది - ప్రీ-రిలీజ్ బిజినెస్ పెరుగుతుంది, మరీ ముఖ్యంగా విడుదలకు ముందే పాటలతో ఓ మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కానీ  ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు దేవిశ్రీ అనే బ్రాండ్ వాల్యూ పూర్తిగా పడిపోయింది.

రీసెంట్ గా దేవిశ్రీ ఇస్తున్న ట్యూన్స్ ఏవీ క్లిక్ అయిన దాఖలాలు లేవు. వినయ విధేయ రామ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన సంగీతం నాసిరకంగా ఉంది. చివరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా నిరాశపరిచాడు. ఇక సంక్రాంతికి విడుదలైన మరో సినిమా ఎఫ్2 కోసం కూడా దేవీశ్రీప్రసాద్ బి-గ్రేట్ ట్యూన్స్ అందించాడు. ఈ రెండు సినిమాల్లో దేవిశ్రీ సిగ్నేచర్ ట్యూన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

కేవలం ఈ రెండు సినిమాలే కాదు, ఈమధ్య కాలంలో దేవిశ్రీ కంపోజ్ చేసిన ఏ ఒక్క పాట క్లిక్ అవ్వలేదు. తన ట్యూన్స్ ను తానే కాపీకొడుతున్నాడనే అపప్రధను మూటగట్టుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆమధ్య మ్యూజికల్ టూర్ పేరిట ఓ 3 దేశాలు చుట్టొచ్చాడు దేవి. ఆ మ్యూజికల్ టూర్ టైమ్ లో ఇచ్చిన ట్యూన్స్ తో పాటు, టూర్ తర్వాత అతడు పనిచేసిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అంటే.. తన టూర్స్ పై పెట్టినంత శ్రద్ధ, సినిమాలపై పెట్టడం లేదన్నమాట.


Full View

Tags:    

Similar News