• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కు సినిమా అంటే చాలు.....

సుక్కు సినిమా అంటే చాలు.. దేవీశ్రీ దంచేస్తాడు అంతే..!

By - Tupaki Desk
Update: 2020-04-08 11:50 GMT
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అది హీరో హీరోయిన్స్ కాంబో అయ్యుండొచ్చు.. డైరెక్టర్ హీరో కాంబో అయ్యుండొచ్చు.. డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ కాంబో అయ్యుండొచ్చు. వాళ్ళు జత కలిస్తే హిట్టే అన్నట్లు ఉంటాయి కొన్ని కాంబోలు. వీటిలో డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మణిరత్నం సినిమాలకు ఒకప్పుడు ఇళయరాజా ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తుంటారు. అలాగే వంశీ సినిమాలకు ఇళయరాజా సంగీతం ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. ఇక మన దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలకు కీరవాణి మాత్రమే మ్యూజిక్ ఇస్తుంటాడు. రాజమౌళి ఫస్ట్ సినిమా నుండి ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వరకు ప్రతీ సినిమాకి కీరవాణే మ్యూజిక్ డైరెక్టర్. అందుకే కీరవాణిని జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు అంటారు. అలానే సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సుక్కు డైరెక్టర్ గా పరిచయమైనప్పటి నుండి ప్రతీ సినిమాకి దేవీనే మ్యూజిక్ అందిస్తున్నాడు. వీళ్లది సూపర్ హిట్ కాంబినేషన్ గా మారిపోయింది. సుకుమార్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా దేవిశ్రీ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ కావలసిందే.

సుకుమార్ మొదటి చిత్రం 'ఆర్య' నుండి 'రంగస్థలం' వరకు సుకుమార్ అన్ని చిత్రాలకు దేవిశ్రీ నే సంగీతం అందించారు. సినిమా ఫెయిల్ అయినా వీళ్ళ కాంబోలో సంగీతం ఎప్పుడు ఫెయిల్ అవలేదు. ఇక బన్నీ తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'కి కూడా సుకుమార్.. దేవిశ్రీ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇప్పటికే దీనిపై వార్తలు వచ్చినప్పటికీ నేడు అధికారికంగా బన్నీ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. హీరో ఎవరైనా.. దేవిశ్రీ ఫార్మ్ లో ఉన్నా లేకున్నా.. అతన్ని వదిలేది లేదని సుకుమార్ మరోసారి నిరూపించాడు. అలానే దేవి కూడా మరోసారి సుక్కు కోసం మ్యూజిక్ ఇరగదీస్తున్నాడని సమాచారం. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ - బన్నీ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్ నిర్ణయించారు. అలాగే ఈ చిత్రంలోని బన్నీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బన్నీ మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ కి విశేష ఆదరణ లభిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా - బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు. తమిళ నటుడు విజయ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • allu arjun 
  • sukumar 
  • AA20 
  • Pushpa 
  • Devisri prasad 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS