• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: 'ఖుషీ' ఖుషీగా...

ఫస్ట్ లుక్: 'ఖుషీ' ఖుషీగా విజయ్ దేవరకొండ - సమంత..!

By - Tupaki Desk
Update: 2022-05-16 04:35 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. #VD11 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల కాశ్మీర్ లో ప్రారంభమైంది.

అయితే #VD11 మేకర్స్ తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేయడంతో పాటుగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. అలానే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి "ఖుషి" అనే టైటిల్ ఖరారు చేశారు.

'ఖుషీ' ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ - సమంత జంట లవ్లీగా కనిపిస్తోంది. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో సిగరెట్ తాగుతూ స్టైలిష్ గా ఉన్న వీడీకి.. ట్రెడిషనల్ గా సారీలో అందంగా ఉన్న సామ్ కి ముడి వేసి ఉండటాన్ని మోషన్ పోస్టర్ లో గమనించవచ్చు. దీనికి మాంగల్యం తంతునానే అంటూ సాగిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.

విజయ్ - సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి.. ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి.. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ ఆకట్టుకుంటోంది.

'ఖుషి' చిత్రాన్ని 2022 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం - మలయాళం - కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ప్రస్తుతం కాశ్మీర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ - వైజాగ్ - అల్లెప్పి లలో చిత్రీకరణ జరుపనున్నారు

విజయ్ - సమంత కలిసి ఇంతకముందు 'మహానటి' చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ జోడి వెండితెరపై కనువిందు చేయబోతోంది. ''ఖుషీ' సినిమాలో జయరాం - సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - లక్ష్మీ - అలీ - రోహిణి - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ - శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దినేష్ నరసింహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 'డియర్ కామ్రేడ్' తర్వాత మైత్రీ బ్యానర్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న రెండో సినిమా ఇది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్, 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఉత్తర్ కుమార్ - చంద్రిక ఆర్ట్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. జయశ్రీ లక్ష్మీనారాయణన్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు.

'లైగర్' వంటి పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న పాన్ సౌత్ ఇండియా మూవీ ''ఖుషీ'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.








Full View

Tags:    
  • Vijay Deverakonda 
  • Samantha 
  • Kushi 
  • Kushi Movie 
  • Kushi First Look 
  • Vijay Devarakonda Kushi 
  • Kushi Release Date 
  • Kushi Teaser 
  • Samantha Kushi 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS