• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రిపబ్లిక్' కోసం మూడో...

'రిపబ్లిక్' కోసం మూడో ఫైల్ రిలీజ్ చేసిన దేవ కట్టా!

By - Tupaki Desk
Update: 2021-09-21 04:49 GMT
సాయితేజ్ హీరోగా దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమాను రూపొందించాడు. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో దేవ కట్టా బిజీగా ఉన్నాడు. తనదైన స్టైల్లో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తుండటం విశేషం. అవినీతి పరులైన రాజకీయ నాయకులను ఎదిరించే ఒక నిజాయితీ పరుడైన కలెక్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందువలన నిజాయితీ పరులైన ఒక్కో కలెక్టర్ పై ఒక్కో వీడియో చేస్తూ, 'థ్యాంక్యూ కలెక్టర్' టైటిల్ తో వాటిని ప్రమోషన్స్ లో భాగంగా వదులుతున్నాడు.

అలా తాజాగా ఆయన మూడవ ఫైల్ అంటూ, 'రజనీ శేఖ్రీ సైబల్ ' పై ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. కొంతకాలం క్రితం హర్యానాలో జరిగిన ఒక భారీ స్కామ్ ను ఆమె అత్యంత ధైర్య సాహసాలతో బయటపెట్టారు. ప్రాణాలకు తెగించి తన పోరాటాన్ని కొనసాగించారు. అవినీతి పరులైన రాజకీయ నాయకులకు .. అధికారులకు శిక్ష పడేలా చేశారు. ఈ విషయంతో కూడిన వీడియో చూస్తుంటే, ఈ సినిమాలో సాయితేజ్ పాత్ర కూడా ఇదే తరహాలో ఉండనుందనే విషయం అర్థమవుతోంది. సామాజిక సందేశం ఉండనుందనే విషయం స్పష్టమవుతోంది.

కలెక్టర్ గా సాయితేజ్ నటించిన ఈ సినిమాలో, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. జగపతిబాబు మరో ముఖ్యమైన పాత్రను పోషించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతకాలంగా సాయితేజ్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆ స్థాయి హిట్ ను అందిస్తుందేమో చూడాలి మరి.






Full View




Tags:    
  • ThankYouCollector 
  • RepublicOnOct1st 
  • Republic 
  • Rajni Sekhri Sibal 
  • Sai Tej 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS