• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీప్తి షన్నూ బ్రేకప్‌.....

దీప్తి షన్నూ బ్రేకప్‌.. గతం పునరావృతం అయ్యేనా?

By - Tupaki Desk
Update: 2021-12-31 08:30 GMT
యూట్యూబ్‌ స్టార్స్ గా దీప్తి సునైన మరియు షన్నూలకు మంచి పేరు ఉంది. ఇద్దరు కూడా యూట్యూబ్‌ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ యూట్యూబ్‌ వల్లే దీప్తి సునైనకు గతంలో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. తాజాగా షన్నూ కు కూడా యూట్యూబ్‌ లో స్టార్‌ గా పేరు దక్కించుకోవడం వల్ల బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్లి ఏకంగా రన్నర్ గా నిలిచాడు. యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి స్నేహితులుగా.. ఆ తర్వాత ప్రేమికులుగా మారిన వీరిద్దరు బిగ్‌ బాస్ వల్ల విడిపోయే పరిస్థితి వచ్చింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో షన్నూ ఎక్కువగా సిరితో క్లోజ్ అవ్వడం.. ముఖ్యంగా ఎమోషనల్‌ గా ఆమెతో కనెక్ట్‌ అవ్వడం తో బయట తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో దీప్తి సునైన ప్రవర్తన చూస్తే షన్నూ వెంటే ఉన్నట్లుగా అనిపించింది. కాని షన్నూ తో బయటకు వచ్చినప్పటి నుండి కూడా దీప్తి మాట్లాడటం లేదట. ఈ విషయాన్ని స్వయంగా షన్నూ ఒక లైవ్‌ లో వెళ్లడించాడు.

దీప్తి సునైన ఇప్పుడు నన్ను బ్లాక్ చేసిందని చెప్పిన షన్నూ మళ్లీ పరిస్థితులు కుదుట పడుతాయి.. దీప్తితో హైదరాబాద్‌ వెళ్లి ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దీప్తి సునైన మాత్రం ప్రస్తుతం షన్నూ పై చాలా కోపంగా ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. గతంలో కూడా తనను బ్లాక్ చేసిన విషయం.. అప్పుడప్పుడు గొడవలు జరిగే విషయాన్ని కూడా షన్నూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో జరిగిన గొడవలకు ఈసారి కాస్త భిన్నమైన పరిస్థితి ఉంది. కనుక గతంలో మాదిరిగా వీరిద్దరూ మళ్లీ కలుస్తారా అనేది కొందరి అనుమానం. దీప్తి సునైన ఏం జరగనట్లుగా సోషల్‌ మీడియాలో గతంలో కంటే ఎక్కువ యాక్టివ్‌ గా ఉంటూ.. ఆనందంగా ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తుంది.

సోషల్‌ మీడియాలో దీప్తి సునైన పోస్ట్‌ లను చూస్తున్న అభిమానులు ఆమె కావాలని ఇలా చేస్తుందా.. షన్నూ నుండి దూరం అయినందుకు సంతోషంగా ఉన్నాను అని చెప్పేందుకు ప్రయత్నిస్తుందా అంటూ డౌటనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దీప్తి మరియు షన్నూ ల విషయం మళ్లీ సోషల్‌ మీడియాలో చర్చ నీయాంశం అయ్యింది. ఈ విషయంలో ఇద్దరికి కామన్‌ స్నేహితులు స్పందిస్తూ గతంలో మాదిరిగా మళ్లీ ఇద్దరు కూడా కలుస్తారు.. కొన్ని వారాలు లేదా.. నెలల సమయం త్వరాత ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పోతారు అనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. దీప్తి సునైన మరియు షన్నూ లు మళ్లీ కలవాలని.. బ్రేకప్‌ వార్తలు నిజం అవ్వద్దంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కొందరు మాత్రం షన్నూ వంటి ఒక నిలకడ లేని వ్యక్తితో.. ఆడవారిని మానసికంగా హింసించే వ్యక్తితో దీప్తి జీవితాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇద్దరి మధ్య దూరం తగ్గేనా.. వారి వారి కుటుంబ సభ్యుల ఒప్పందం తో దగ్గర అయ్యేనా అనేది చూడాలి.



Tags:    
  • Deepthi Sunaina 
  • Shanmukh Jaswanth 
  • Deepthi Sunaina images 
  • Shanmukh Jaswanth short films 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS