ఆ రోజు 'అమిర్'తో జరిగిన సంఘటన మర్చిపోలేనిది!
ఈ కరోనా లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలు సామాన్య ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక ఇళ్లకే పరిమితం అయిన హీరోలు హీరోయిన్లు సరదాగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే లాక్ డౌన్‌లో సమయాన్ని వృథా చేయకుండా ఇంట్లో పనులు చేయడం, వంటలు చేయడం వంటి పెద్ద పెద్ద ప్రయోగాలే చేస్తున్నారు. ఇక వారి అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె తన 13యేళ్ళ వయసులో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను, ఓ మెమొరబుల్ ఫోటోని షేర్ చేసింది. ఈ నేపథ్యంలో దీపిక 20ఏళ్ల క్రితం.. అంటే 2000వ సంవత్సరంలో ఆమిర్‌ఖాన్‌తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో దీపికా సన్నగా ఉండి.. తండ్రి పక్కన కూర్చొని ఉంది. ఆమె పక్కన తండ్రి ప్రకాష్ పదుకొనెతో పాటు.. తల్లి ఉజ్జల, సోదరి అనిషాలతో స్టార్ హీరోగా వెలుగుతున్న అమిర్ ఖాన్ కూడా ఉన్నారు.
దీపిక ఈ ఫోటో షేర్ చేసి.. ఆ ఫోటో వెనక ఉన్న ఓ చిన్న సరదా స్టోరీని బయట పెట్టింది. వారింట్లో అమిర్ ఖాన్‌తో భోజన చేసే సందర్భంలో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పింది. ఇక ఆ ఫోటో గురించి గుర్తుచేసుకుంటూ.. ''ఇది జనవరి1, 2000 నాటి ఫోటో. నాకు అప్పుడు 13 ఏళ్లు. అమిర్ తో ఇబ్బందిగా అనిపించినా కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ సమయంలో అమిర్ పెరుగన్నంతో భోజనం చేస్తున్నాడు. నేను ఎప్పటిలాగే ఆకలితో ఉన్నాను. కానీ ఆయన నాకు పెట్టకుండానే తిన్నారు. నేను కూడా ఆయనను అడగలేదు.'' అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా దీపికా.. ఇటీవలే నటించిన ఛపాక్ చిత్రం పై అమిర్ స్పందించారట. ఆయన మాట్లాడుతూ.. "ఛపాక్ ఓ గొప్ప సినిమా. మేఘనా, దీపిక, విక్రాంత్‌కు అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీపికా.. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 83 సినిమాలో నటిస్తుంది.