దీపికా కోడ్ భాష.. 'మాల్‌' అంటే సిగరెట్స్.. 'హ్యాష్' అంటే స్లిమ్‌ సిగరెట్స్...?

Update: 2020-09-30 07:30 GMT
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. దీపికా తన మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో వాట్సాప్ ఛాట్ లో 'మాల్' 'హ్యాష్' గురించి డిస్కస్ చేసినట్లు బయటపడటంతో.. వీరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో ఎన్సీబీ విచారించింది. 2017 అక్టోబర్ 28న వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లో 'D'(దీపికా) మరియు 'K'(కరిష్మా) మధ్య జరిగినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 'మాల్ ఉందా?' అని దీపికా అడుగగా.. 'ఇంట్లో ఉంది. కానీ నేను బాంద్రాలో ఉన్నాను' అని కరిష్మా రిప్లై ఇచ్చింది. 'నీకు కావాలంటే అమిత్ ని అడుగుతాను' అని మెసేజ్ చేసింది. దీనికి దీపికా 'ఎస్.. ప్లీజ్' అని సమాధానం ఇచ్చింది. కొద్ది సేపటికి 'అమిత్ దగ్గర ఉంది. అతను తీసుకొస్తున్నాడు' అని కరిష్మా చెప్పింది. 'హ్యాష్ నా?' 'వీడ్ వద్దు' అంటూ దీపికా మెసేజ్ చేసింది. ఎన్సీబీ అధికారులు 'మాల్' 'హ్యాష్' 'వీడ్' గురించే దీపికాను ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే ఎన్‌సీబీ అధికారులు అడిగిన వాటికి చాలా తెలివిగా సమాధానం చెప్పిన దీపికా.. కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. అలానే దీపికా - కరిష్మా ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా ఒకేరకమైన సమాధానాలు చెప్పారట. కరిష్మాతో చాట్ చేసిన విషయాన్ని అంగీకరించిన దీపికా.. తనకు డ్రగ్స్‌ అలవాటు లేదని చెప్పిందట. తనకు సిగరెట్స్ తాగే అలవాటు మాత్రమే ఉందని.. డ్రగ్స్‌ అలవాటు లేదని స్పష్టం చేసిందట. చాటింగ్ లో మేము కోడ్ భాష వాడామని.. 'మాల్‌' అంటే సిగరెట్స్ అని.. 'హ్యాష్' అంటే స్లిమ్‌ సిగరెట్స్ అని.. 'వీడ్‌' అంటే మందపాటి సిగరెట్స్ అని దీపికా సమాధానమిచ్చిందట. దీపిక చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఎన్సీబీ అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే ని మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.


Tags:    

Similar News