అతడి క్రేజ్ తక్కువే ఐనా నన్ను అలా పడేశాడు

Update: 2021-01-31 03:54 GMT
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణవీర్‌ సింగ్ మరియు దీపిక పదుకునేలా జోడీ అందరికి ఆదర్శం అన్నట్లుగా ఉంటారు. వీరిద్దరి ప్రేమ వివాహం ఎంతో మంది ప్రేమ జంటలకు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న ప్రేమ జంటలకు మార్గదర్శకంగా నిలిచిందని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు. స్టార్స్ గా ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా దీపిక తాను రణవీర్‌ సింగ్ కు భార్యను అనే విషయం అలాగే రణవీర్ తాను దీపిక భర్తను అనే విషయం అందరు గుర్తించేలా పబ్లిక్ లో ఉంటారు. ఇద్దరు అత్యంత అన్యోన్యంగా ఉండటంతో పాటు ఒక సాదారణ భార్య భర్తల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వారి మద్య ప్రేమకు అందరు ఫిదా అవ్వాల్సిందే.

రణవీర్ సింగ్‌ తో పెళ్లి సమయంలో దీపిక టాప్‌ స్టార్‌. ఆ సమయంలో రణవీర్‌ మాత్రం ఒక అప్‌ కమింగ్ హీరో. అయినా కూడా ఇద్దరి మద్య జోడీ కుదిరింది. ఇప్పుడు రణవీర్ స్టార్‌ హీరో. దీపిక రేంజ్ కంటే ఎక్కువ ఆమె కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతడి క్రేజ్‌ గురించి ఆ సమయంలో తాను పట్టించుకోలేదు అంటూ దీపిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మా ఇద్దరి పరిచయం ఆరంభంలో నా సంపాదన మరియు నా సక్సెస్‌ ను ఎక్కువగా గౌరవించేవాడు. ఆ విషయంలో నేను ఎమోషనల్‌ గా రణవీర్ తో కనెక్ట్‌ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రణవీర్ నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు.. నా కంటే బిజీగా ఉంటున్నాడు. అయినా కూడా మా ఇద్దరి మద్య అదే కెమిస్ట్రీ కొనసాగుతుందని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News