మా ఇద్దరి మద్య ఆ చర్చ ఖచ్చితంగా ఉంటుంది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే సినీ కెరీర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. సాదారణంగా ఏ హీరోయిన్ కు అయినా పెళ్లి అయితే కెరీర్ లో కాస్త డల్ అవుతూ ఉంటారు. కాని దీపిక పదుకునే మాత్రం పెళ్లి తర్వాత మరింతగా స్టార్ డంతో దూసుకు పోతున్నారు. ఇండియాస్ టాప్ స్టార్ హీరోయిన్ గా ఆమె పేరు దక్కించుకుంది. ఇక త్వరలో ఈమె భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి నటించిన '83' సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
తాజాగా దీపిక పదుకునే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. కెరీర్ తో పాటు వైవాహిక జీవితం గురించి కూడా దీపిక చెప్పుకొచ్చింది. మీరు రణ్వీర్ తో సినిమాల గురించి మాట్లాడుతారా అంటూ ప్రశ్నించగా దీపిక సమాధానం చెబుతూ.. మా ఇద్దరి మద్య ఖచ్చితంగా సినిమాల గురించి చర్చ వస్తుంది. ఇద్దరం కూడా నటించే సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇద్దరం కలిసి నటించేందుకు చాలా ఇష్టపడతామని చెప్పుకొచ్చింది. ఒకరి సినిమాల గురించి ఒకరం మాట్లాడుకోవడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇచ్చుకుంటామని చెప్పుకొచ్చింది.