శ్రామిక్ రైళ్లలోనూ వలస కార్మికుల మృత్యుగీతం

Update: 2020-09-19 17:31 GMT
రోనా లాక్ డౌన్ వేళ అందరికంటే తీవ్ర ఇబ్బందులు పడింది వలస కార్మికులే.. నిలువ నీడ లేక.. పోవడానికి రవాణా సౌకర్యాలు లేక.. తిండికి తిప్పలై కాలినడకన పోయిన వారు ఎందరో.. ఈ క్రమంలోనే కేంద్రం శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాలకు వలస కార్మికులను పంపింది. ఈ శ్రామిక్ రైళ్లలో క్రమంలో 97 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేడు రాజ్యసభలో వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో సంభవించిన వలస కార్మికుల మరణాలకు సంబంధించి తమ వద్ద ఎటువంటి లెక్కలు లేవని ఇటీవల కేంద్రం ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తొలిసారిగా శ్రామిక్ రైళ్లలో సంభవించిన మరణాల లెక్కలను రాజ్యసభలో ప్రకటించింది.

 టీఎంసీ పార్లమెంట్ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రయన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం మేరకు.. సెప్టెంబర్ 9 వరకూ శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వారిలో 97 మంది మరణించారని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీటిని అసహజ మరణాలుగా పరిగణిస్తూ సెక్షన్ 174 కింద రాష్టాల పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.

 మొత్తం కేసుల్లో 87 కేసులకు సంబంధించి మృత దేహాలకు పోస్టు మార్టం నిర్వహించారని తెలిపారు. 51 కేసుల్లో గుండె పోటు, లివర్, ఊపరితిత్తుల దీర్ఘ కాలిక సమస్యల కారణంగా బాధితులు మరణించినట్టు పోస్ట్ మార్టం నివేదికల్లో తేలిందన్నారు.
Tags:    

Similar News