టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్.. ఆ సరికొత్త రికార్డు ఏంటి?
టాలీవుడ్ కొన్ని సినిమాలు తెలుగులోనే కాదు. యూట్యూబ్ లో వేరే భాషలోకి డబ్ అయి రిలీజ్ అయినా మంచి వ్యూస్.. లైక్స్ సొంతం చేసుకుంటాయి. అందులో హిట్ సినిమాలే కాదు.. ఘోరంగా ఫ్లాఫ్ అయినా కూడా వేరే చోట మంచి హిట్ అవుతుంటాయి. అవి రీమేక్ రూపంలో కావచ్చు లేదా డబ్ చేయబడి కావచ్చు. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపుతూ మంచి క్రేజ్ దక్కించుకుంటున్నాయి. ఇక ఇటీవలే యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. రష్మిక మందన కాంబినేషన్ లో రూపొంది భారీ అంచనాల మధ్య విడుదలైన యూత్ ఫుల్ మూవీ డియర్ కామ్రేడ్. టాలీవుడ్ లో రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ తెచ్చుకొని భారీ లెవెల్ లో బిజినెస్ కోల్పోయింది. ఇక పాటలు హిట్ అయినా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మిగిలిన విషయం తెలిసిందే.
ఆ సినిమా ఇప్పుడు టాలీవుడ్ తరుపున హిందీలో డబ్ అయి విడుదలైన సినిమాలలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. హిందీలో డబ్ అయిన అన్ని సినిమాలలో హైయెస్ట్ లైక్స్ సొంతం చేసుకున్న సినిమాగా డియర్ కామ్రేడ్ మూవీ సంచలన రికార్డ్ నమోదు చేసింది. ఏకంగా 1.6 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది డియర్ కామ్రేడ్. ఇక వ్యూస్ పరంగా 130 మిలియన్ల పై దూసుకెళ్తున్నా.. లైక్స్ మాత్రం వీర లెవల్ లో సాధించి ఇతర సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా.. దీని తర్వాత 1.3 మిలియన్ల లైక్స్ తో జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ మూవీ రెండవ స్థానంలో ఉంది. ఇక హలో గురు ప్రేమకోసమే.. ఇస్మార్ట్ శంకర్.. సరైనోడు.. అఆ.. ఇలా అన్నింటి కన్నా హైయెస్ట్ లైక్స్ సొంతం చేసుకుంది. నిజానికి ఎవ్వరి ఊహలకు అందని విధంగా 250 మిలియన్ల పైగా వ్యూస్ ఉన్న అల్లు అర్జున్ సరైనోడు మూవీని కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిందని చెప్పాలి. మరి దీన్ని బ్రేక్ సినిమా ఏదవుతుందో చూడాలి.