• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షారూక్ తో డేటింగ్..!...

షారూక్ తో డేటింగ్..! క‌ర‌ణ్ బ‌యోగ్ర‌ఫీలో సంచ‌ల‌నాలు!!

By - Tupaki Desk
Update: 2022-06-24 11:30 GMT
ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ వ్య‌క్తిగ‌త జీవితంపై చాలా పుకార్లు ఉన్నాయి. అత‌డు స్వ‌లింగ సంప‌ర్కుడు అని.. గ‌తంలో కింగ్ ఖాన్ షారూక్ తో డేటింగ్ చేసాడ‌ని.. ఆ ఇద్ద‌రి న‌డుమా ఏళ్ల త‌ర‌బ‌డి రొమాన్స్ పండింద‌ని కూడా బాలీవుడ్ మీడియాలు క‌థ‌నాలు అల్లాయి. అయితే ఇవ‌న్నీ నిజాలేనా?  కాదా? అన్న‌ది అటుంచితే ఈ దుష్ప్ర‌చారం అత‌డి మ‌న‌సులో క‌ల్లోలానికి కార‌ణ‌మైంద‌ని.. త‌న‌ జీవితంపై చాలా ప్ర‌భావం చూపింద‌ని అత‌డి బ‌యోగ్ర‌పీ బుక్ వెల్ల‌డించింది. షారూక్ తో నిజంగానే క‌ర‌ణ్ రొమాన్స్ చేసాడా? అన్న‌దానికి తాజాగా అత‌డు రాసుకున్న బ‌యోగ్ర‌ఫీలో స‌మాధానం ఇచ్చారు.  కరణ్ ఎప్పుడూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించినా కానీ ఇప్పుడు తన జీవిత చరిత్ర 'యాన్ అన్ సూటబుల్ బాయ్'లో పుకార్లను కొట్టి పారేసాడు.

షారుఖ్ ఖాన్ తో తన లైంగిక సంబంధం గురించి పుకార్లు షికార్ చేసిన‌ప్పుడు తాను ఎంతో క‌ల‌త‌కు గుర‌య్యాన‌ని కూడా క‌ర‌ణ్ ఈ పుస్త‌కంలో వెల్ల‌డించారు. అన్న‌య్య లేదా తండ్రితో సంబంధం అంట‌గ‌డ‌తారా? అని కూడా ప్ర‌శ్నించారు. చాలా సంవత్సరాలుగా కరణ్ జోహార్ షారుఖ్ ఖాన్ తో లైంగిక సంబంధం కలిగి ఉన్నారనే పుకార్ల వెన‌క ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహానుబంధం తరచుగా ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకునే విధానం కార‌ణాలుగా చూపుతారా? అన్న‌ది అత‌డి ప్ర‌శ్న‌.

ప్ర‌తిసారీ మీడియాలో క‌ర‌ణ్ లైంగిక ధోరణి పై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. చాలా సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ తో అతను లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని పుకార్లు సంచ‌ల‌నంగా మారాయి. షారూఖ్ తో డేటింగ్ గురించి వచ్చిన ఈ పుకార్లు తనను ఎంతగా ప్రభావితం చేశాయనే దాని గురించి కరణ్ తన పుస్తకంలో చెప్పాడు. ఎందుకంటే SRK తనకు తండ్రి లాంటి వాడు అని ప్ర‌స్థావించారు. కింగ్ ఖాన్ తో తనకున్న సంబంధం గురించి ఒక ఇంటర్వ్యూయర్ తనను ఎలా అడిగాడో కూడా అతను గుర్తుచేసుకున్నాడు. అయితే ఈ రూమర్ల గురించి షారుఖ్ అస్సలు పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు.

"ఈ రోజు ప్రపంచంలోని సెక్స్ లో పాల్గొనడానికి నాకు అన్ని ర‌కాల మార్గాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అది నిజానికి నేను కాదు. నాకు సెక్స్ అనేది చాలా చాలా వ్యక్తిగతమైనది.. చాలా సన్నిహిత భావన. అది ఎవ‌రితో అయినా క్యాజువల్ గా చేసేది కాదు. దాని కోసం పెట్టుబ‌డి (మాన‌సికంగా) పెట్టాలి... నాపై రూమర్ లను నేను ఎప్పుడూ మ్యానేజ్ చేయ‌గ‌ల‌ను'' అని అన్నారు.

నా లైంగిక సంబంధం గురించి చాలా ఊహాగానాలొచ్చాయి. షారూక్ తో నా సుఖం గురించి చాలా సంవత్సరాలుగా పుకార్లు చెల‌రేగాయి. ఆ ప్ర‌చారం వ‌ల్ల నేను చాలా బాధపడ్డాను. నేను ఒక హిందీ ఛానెల్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. నన్ను షారుఖ్ గురించి అడిగారు. 'యే అనోఖా రిష్టా హై ఆప్ కా' అని ఇంటర్వ్యూయర్ అడిగాడు. అతను నాకు నిజంగా కోపం వచ్చేలా ప‌ద‌జాలం వాడాడు. ''నువ్వు మీ తమ్ముడితో పడుకుంటున్నావా? అని నేను అడిగితే..! నీకు ఎలా అనిపిస్తుంది? కాబట్టి అత‌డిని సీరియ‌స్ గా ప్ర‌శ్నించాను. "మీ ఉద్దేశ్యం ఏమిటి?'' మీరు నన్ను ఈ ప్రశ్న ఎలా అడగగలరు? నేను కెరీర్ లో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నా షారూక్ నాకు తండ్రిలా.. అన్నయ్యలా ఆదుకున్నారు. నేను అతనిని అలా చూడటం లేదా అలాంటి పుకార్లకు గురికావడం హాస్యాస్పదం. ప్రజలు అర్ధంలేని మాటలు మాట్లాడతారు. ఒక వ్యక్తి వివాహేతర సంబంధం కలిగి ఉండకపోతే అతడిని స్వలింగ సంపర్కుడిగా భావిస్తార‌ని కరణ్ జోహార్ ఆ పుస్తకంలో ఎంతో ఆవేద‌న‌గా ప్ర‌స్థావించారు.

తన లైంగిక ధోరణిపై ప్ర‌జ‌ల‌ ప‌రీక్ష‌ల‌ను ఉద్దేశించి కరణ్ సీరియ‌స్ అయ్యారు. స్వలింగ సంపర్కం పట్ల తిరోగమన ధోరణి ఈ దేశంలో అవమానక‌రంగా ఉంద‌ని అన్నారు. భారతదేశంలోని న్యాయవ్యవస్థ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసి ఉండకపోతే లేదా గుర్తించి ఉండ‌క‌పోతే తాను అధికారికంగా ఇలా బయటకు వచ్చేవాడిని కాదని ఆయన అన్నారు. త‌న‌పై జ‌రిగిన దుష్ప్ర‌చారానికి ఆయ‌న తీవ్రంగా క‌ల‌త చెందార‌ని తాజా బ‌యోగ్ర‌ఫీ వెల్ల‌డిస్తోంది.
Tags:    
  • Bollywood 
  • KaranJohar 
  • ShahRukhKhan 
  • SocialMedia 
  • Viral 
  • SRK 
  • BollywoodStars 
  • BioGraphy 
  • MovieNews 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS