• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దాసరి మాటలు సూచనలా.....

దాసరి మాటలు సూచనలా.. చురకలా?

By - Tupaki Desk
Update: 2016-08-02 05:39 GMT
దర్శకరత్న దాసరినారాయణరావుని ఇండస్ట్రీ అంతా గౌరవంగా / ముద్దుగా పిలుచుకునే పేరు "గురువుగారు"! ఈ గురువుగారు సూచనలు చేస్తారో - చురకలు వేస్తారో తెలియక తెగ ఇబ్బందిపడుపొతుంటారు మీడియా వారు, సినీ జనాలు. ఈ సూచనలు కం చురకలకు ఆడియో ఫంక్షన్ - సినిమా సక్సెస్ మీట్ లను వేదికలుగా చేసుకుంటుంటారు. అనంతరం వాటిపై ఇండస్ట్రీలో హాట్ హాట్ డిస్కషన్స్ - డిబేట్స్ జరుగుతుంటాయి. తాజాగా "పెళ్లిచూపులు" మూవీ సక్సెస్ మీట్ కు వచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు - ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇంతకీ దాసరి అన్నమాటలు ఏమిటంటే... "రీమేక్‌ లపై మోజు వద్దు" అని. దాసరి ఏమి మాట్లాడినా వాటిలో మంచిని వెతికేవారు ఎంతమందో - దాన్ని ఎవరికో వేసిన చురకగా భావించేవారు అంతేమంది ఉన్నారు! ఈ కామెంట్ ను సరిగ్గా పరిశీలిస్తే.. తెలుగులో ఇప్పుడు రీమేక్ లు చేస్తున్నది ఎవరు? స్టార్ హీరోలలో ప్రముఖంగా కనపడుతున్నది... చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - వెంకటేష్.

చిరంజీవి.. తన ప్రెస్టీజియస్ ప్రాజెక్టు 150వ చిత్రంగా "కత్తి" సినిమాని రీమేక్ చేస్తూంటే - రామ్ చరణ్ తన తాజా చిత్రంగా "తని ఒరువన్" రీమేక్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే... తాజాగా తమిళ సూపర్ హిట్ "వేదాలం" రీమేక్ చెయ్యాలని నిర్ణయంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పవన్ చేసిన చిత్రాల్లో రీమేక్ లది ప్రధాన పాత్రే! సర్దార్ గబ్బర్ సింగ్ కు ముందు వచ్చిన "గోపాల గోపాల" సినిమా హిందీ చిత్రం "ఓ మై గాడ్" కు రీమేక్ అయితే, అంతకు ముందు వచ్చిన బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్.. "దబాంగ్" కు రీమేక్. ఇక వెంకటేష్ విషయానికొస్తే.. ఆయన కెరీర్ లో ఎక్కువ శాతం సక్సెస్ సినిమాలు రీమేక్ లే. దానికి కొనసాగింపుగా తాజాగా "సాలా కుద్దాస్" చిత్రం రీమేక్ కు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో దాసరి... చేసిన కామెంట్స్ ఏ హీరోలను ఉద్దేశించి అనేదానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆయన క్యాజువల్ గా అన్నారని, ఆయన చెప్పిన విషయంలో తప్పేమీ లేదని చెప్పేవారు చెబుతుంటే.. కాదు కాదు అని స్టార్ హీరోలకు ఆపాదించేస్తున్నారు మరికొందరు. ఏది ఏమైనా.. గురువుగారు చెప్పిన విషయాలు ఇండస్ట్రీ మంచికే అని క్లారిటీ ఇస్తున్నారు శిష్యులు!
Tags:    
  • Dasari Narayana Ra 
  • Remake Movies 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS