ఫోటో స్టోరి: వేడిగా వ‌డ్డిస్తున్న బెజ‌వాడ‌ బ్యూటీ

Update: 2021-05-20 03:30 GMT
నిరంత‌రం అందాల క‌థానాయిక‌ల్ని టాలీవుడ్ కి ప‌రిచయం చేస్తున్న ఆర్జీవీ విజ‌య‌వాడ అమ్మాయి దక్షి గుత్తికొండను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. `కరోనా వైరస్` అనే సినిమాతో  ఈ తెలుగు బ్యూటీని వ‌ర్మ పరిచయం చేస్తున్నారు.

ద‌క్షి ఇటీవ‌ల స‌డెన్ గా జ‌నాల అటెన్ష‌న్ ని గ్రాబ్ చేస్తోంది. ఆర్జీవీ డిస్క‌వ‌రీనా మ‌జాకానా ? అనే రేంజులో ఈ అమ్మ‌డి ఫోటోషూట్లు హీట్ పెంచుతున్నాయి. 2020 లాక్ డౌన్ సమయంలో ఆర్జీవీ నిర్మాతగా మారి తెరకెక్కించిన కరోనా వైరస్ కేవ‌లం గంట 24 నిమిషాల సినిమా. ఇందులో కోడలి పాత్ర చేసిన ఈ నటి హాట్ ఫొటోలను ఆర్జీవీ  ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూనే ఉన్నారు. అవి యువ‌త‌రంలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

ఊర్మిల మొద‌లు ఆర్జీవీ నాయిక‌లంతా హాట్ గాళ్స్ గానే పాపుల‌ర‌య్యారు.  నేక్డ్ అనే చిత్రంతో శ్రీ‌రాపాక‌ను అంతే పాపుల‌ర్ చేశారు. ఇటీవల డీకంపెనీ పేరుతో ప‌లువురిని ప‌రిచ‌యం చేస్తున్నారు. హాట్ గాళ్స్ నైనా గంగూలీ..అప్స‌ర రాణి ఇప్ప‌టికే అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే బాట‌లో ఇప్పుడు ద‌క్షి గుత్తికొండ కూడా సంచ‌ల‌నంగా మారుతోంది. విజ‌య‌వాడ నుంచి బ‌రిలో దిగిన టాప్ మోడ‌ల్ కం న‌టి టాలీవుడ్ ని ఏల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News