ఈ వారమంతా అల్లు వారిదే

Update: 2016-02-15 11:30 GMT
అల్లు అరవింద్ ఎప్పుడూ ఆచితూచి సినిమాలు చేస్తుంటాడు. చకచకా సినిమాలు చేయాలని ఆయన హడావుడి పడరు. హిట్టు కొట్టినా.. ఫ్లాప్ ఇచ్చినా ఆయన పద్ధతి ఇలాగే ఉంటుంది. ఐతే ఈ మధ్య మాత్రం కొంచెం స్పీడు పెంచారు. ‘భలే భలే మగాడివోయ్’తో మాంచి హిట్టు కొట్టాక.. తన కొడుకులిద్దరితో సినిమాలు మొదలుపెట్టారు. పెద్ద కొడుకు అల్లు అర్జున్ తో చేస్తున్న ‘సరైనోడు’, చిన్న కొడుకు శిరీష్ తో చేస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ దాదాపుగా పూర్తయ్యే స్థితిలో ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ తో ‘తనీ ఒరువన్’ రీమేక్ కు కూడా అల్లు వారు రంగం సిద్ధం చేశారు. ఈ మూడు సినిమాలకు సంబంధించిన విశేషాలతో ఈ వారమంతా టాలీవుడ్లో గీతా ఆర్ట్స్ సందడి నెలకొంటోంది.

ఇప్పటికే శిరీస్ మూవీ ‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి వచ్చింది. ఆ కలర్ ఫుల్ పోస్టర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. దీని తర్వాత ఈ నెల 18వ తారీఖున ఏకాదశి సందర్భంగా గీతా ఆర్ట్స్ రెండు కార్యక్రమాలకు ముహూర్తం పెట్టింది. ఆ రోజున ‘సరైనోడు’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజవబోతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టరుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ.. టీజర్ తోనూ అభిమానుల్ని అలరించబోతున్నాడు. ఇక అదే రోజు.. ‘తనీ ఒరువన్’ రీమేక్ ప్రారంభోత్సవం కూడా జరపబోతుండటం విశేషం. అనేక సందేహాలకు, చర్చలకు దారితీసిన ‘తనీ ఒరువన్’ రీమేక్ ఎట్టకేలకు మొదలవుతుండటంతో మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. ప్రారంభోత్సవం రోజే దీని టైటిల్ కూడా ప్రకటించబోతున్నారట. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News