ప్రస్తుతం అంతా ఓటీటీ ప్రపంచం రాజ్యమేలుతోంది. థియేటర్ల లో కంటే చాలా మంది జనాలు ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి ఇష్టపడతున్నారు. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ మొత్తం వీక్షించడానికి ఓటీటీ బెస్ట్ ఛాయిస్ గా వారు భావిస్తున్నారు. దానికి తగినట్లే, ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తికర వెబ్ సిరీస్ లతో మన ముందుకు వస్తున్నారు. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.
ఈ వెబ్ సిరీస్ పేరు సైతాన్. పేరుకు తగినట్లే సిరీస్ లోని ఎపిసోడ్స్ చాలా భయంకరంగా ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ను విపరీతం గా నవ్వించిన మహి.వి. రాఘవన్ ఈ క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ కి దర్శకత్వం వహించారు. మొన్నటి వెబ్ సిరీస్ తో కడుపుబ్బా నవ్వించిన ఈయన ఈ సారి అందరినీ భయపెట్టాల ని డిసైడ్ అయ్యాడు.
ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేశారు. జూన్ 15 నుంచి ఈ సైతాన్ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్‌తో పాటు ఫస్ట్‌లుక్ ను సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఓ పోలీస్ ను మర్డర్ చేస్తూ ప్రధాన పాత్రధారులు కనిపిస్తున్నారు. ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఫస్ట్ లుక్ తో నే సిరీస్ ఏ విధంగా సాగుతుంది అనే హింట్ ఇచ్చేశారు.
అయితే, రెగ్యులర్ క్రైమ్ సిరీస్ లాగే ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. ఇప్పటి వరకు తెలుగులో మీరు చూడాని విధమైన క్రైమ్ థ్రిల్లర్ అను భూతి మీకు ఈ వెబ్ సిరీస్ ఇస్తుందని టీమ్ చెబుతోంది.
సైతాన్ సిరీస్ లో కామాక్షి భాస్కర్ల, దేవయాని, రిషి, అనీషా దామా, నితిన్ ప్రసన్నతో పాటు విక్రమ్ ఫేమ్ జాఫర్ సాధిఖ్ కీలక పాత్రలను పోషిస్తోన్నారు. దీని తర్వాత సేవ్ ది టైగర్స్ రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.