• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ళ‌ప‌తితో స్టార్...

ద‌ళ‌ప‌తితో స్టార్ డైరెక్ట‌ర్‌ పాన్ ఇండియా స్కెచ్

By - Tupaki Desk
Update: 2022-06-29 02:30 GMT
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ తో లోకేష్ క‌న‌గరాజ్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `విక్ర‌మ్‌`. దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత క‌మ‌ల్ నుంచి వ‌చ్చిన ఈ మూవీ ఊహించ‌ని స్థాయిలో రికార్డులు తిర‌గ‌రాస్తూ క‌మ‌ల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై క‌మ‌ల్ న‌టించి నిర్మించిన ఈ మూవీ కేవ‌లం రెండు వారాల్లోనే రూ. 100 కోట్ల మార్కుని దాటేసి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది.

ఈ మూవీ సాధిస్తున్న విజ‌యానందంలో వున్న క‌మ‌ల్ హాస‌న్ చిత్ర ద‌ర్శ‌కుడికి, టీమ్‌కి కానుక‌ల వ‌ర్షం కురిపించారు. హీరో సూర్య ఈ మూవీలో రోలెక్స్ గా అతిథి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌లో న‌టించినందుకు గాను హీరో సూర్య‌కు క‌మ‌ల్ రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా అందించి త‌న ఆనందాన్ని పంచుకున్నారు. అంతే కాకుండా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో `విక్ర‌మ్‌`కు సీక్వెల్ గా `విక్ర‌మ్ 3`ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు కూడా.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తో ఓ భారీ గ్యాంగ్ స్ట‌ర్ మూవీకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో హీరో విజ‌య్ గ్యాంగ్ స్ట‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒక‌టి బ‌య‌టికి కోలీవుడ్ వ‌ర్గాల్లో చక్క‌ర్లు కొడుతోంది. విజ‌య్ తో చేయ‌బోతున్న ఈ మూవీ ముంబై నేప‌థ్యంలో ప్ర‌ధానంగా సాగుతుంద‌ని తెలుస్తోంది.

ఎంటైర్ మూవీ అంతా ముంబై నేప‌థ్యంలోనే సాగ‌నుంద‌ని, ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ ఫైన‌ల్ స్టేజ్ కి చేరిన ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోందని తెలిసింది. అంతే కాకుండా ఈమూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల కోసం పేరున్న‌ బిగ్ స్టార్స్ ని ద‌ర్శ‌కుడు సంప్ర‌దిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్నార‌ట‌. 
Tags:    
  • Lokesh Kanagaraj 
  • Vijay 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS