'PSPK28' అప్డేట్: మీరు ఖచ్చితంగా ఇష్టపడతారంటూ హరీష్ ట్వీట్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను 'గబ్బర్ సింగ్' సినిమాతో కాలరెగరేసుకునేలా చేశాడు దర్శకుడు హరీశ్ శంకర్. అప్పటి వరకు ప్లాపుల్లో ఉన్న పవన్ కు బ్లాక్ బస్టర్ అందించడమే కాకుండా.. పవన్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించారు. దీంతో పవర్ స్టార్ - పవర్ ఫుల్ డైరెక్టర్ కాంబోలో మరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్.. '#PSPK28' అనౌన్స్ మెంట్ రావడంతో ఖుషీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి డైలీ ఏదొక రూమర్ వస్తూనే ఉంది. సినిమా నేపథ్యం ఇదని.. టైటిల్ ని ఖరారు చేసారని.. పవన్ పాత్ర ఇలా ఉండబోతోందని.. హీరోయిన్ ఈమె అని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. '#PSPK28' కు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఆఫీసియల్ హ్యాండిల్ నుంచే వస్తుందని పేర్కొన్నారు.
''ఉగాది పండుగకు టైటిల్ & ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కాని మహమ్మారి పరిస్థితి కారణంగా దానిని వాయిదా వేశాం. సోషల్ మీడియాలో PSPK28 చిత్రం గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుండటం సంతోషం. కాని ఆఫీసియల్ అప్డేట్స్ ఏవైనా సరైన సమయంలో ఎక్స్ క్లూజివ్ గా మా హ్యాండిల్స్ నుండి వస్తుందని గుర్తుంచుకోండి!'' అని మైత్రీ టీమ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ ట్వీట్ చేస్తూ.. ''దయచేసి టైటిల్ గురించి ఉహాగానాలు ప్రచారం చేయవద్దు. మీరు అలైన టైటిల్ ని ఖచ్చితంగా ఇష్టపడతారు! మీకన్నా నేను ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాను!!'' అని అంచనాలు పెంచేసారు.
కాగా, PSPK28 తో మళ్ళీ 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ అవుతుందని పీకే ఫ్యాన్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే 'ఈసారి వినోదం మాత్రమే కాదని' మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.