• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ 154 కోసం...

మెగాస్టార్ 154 కోసం క్రేజీ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2022-01-06 10:30 GMT
మెగాస్టార్ చిరంజీవి స్పీడు పెంచారు. మునుపెన్న‌డూ లేనంత‌గా ఆయ‌న వ‌రుస సినిమాల‌ని లైన్ లో పెట్టేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస‌గా నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొర‌టాల శివ‌తో చేస్తున్న `ఆచార్య‌` చిత్రీక‌ణ పూర్తయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ పూర్తయిపోవ‌డంతో చిరు .. మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్న `గాడ్ ఫాద‌ర్‌`, మెహ‌ర్ ర‌మేష్ రూపొందిస్తున్న‌ `భోళా శంకర్‌` చిత్రాల‌పై ఫోక‌స్ పెట్టారు. ఈ రెండు చిత్రాల‌తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌వీంద్ర (బాబీ) డైరెక్ష‌న్ లో చేస్తున్న సినిమా పై కూడా ప్ర‌త్యేక దృష్టి సారించారు. అయితే ఈ మూవీ విష‌యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. మెగాస్టార్ 154వ సినిమా రానున్న ఈ మూవీపై గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి అండ‌ర్ క‌వ‌ర్ కాప్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని, అయితే అది సినిమా మ‌ధ్య‌లో రివీల్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో మెగాస్టార్ కు జోడీగా క్రేజీ హీరోయిన్ ని సంప్ర‌దిస్తున్నార‌ని, ఆ హీరోయిన్ కూడా దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని తెలుస్తోంది. ఆ క్రేజీ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు శృతిహాస‌న్‌. `క్రాక్‌` క్రాకింగ్ హిట్ తో ట్రాక్ లోకి వ‌చ్చిన శృతిహాస‌న్ వెంట‌నే `స‌లార్‌`లో న‌టించే ఛాన్స్‌ని ద‌క్కించుకుని షాకిచ్చింది.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. తాజాగా మెగాస్టార్ మూవీకి ఓకే చెప్ప‌నుండ‌టంతో అమ్మ‌డి డిమాండ్ మామూలుగా లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఫైన‌ల్ టాక్స్ ద‌శ‌లో వున్న ఈ డీల్ త్వ‌ర‌లోనే ఫినిష్ అయిపోతుంద‌ని, మైత్రీ నుంచి అఫీషియ‌ల్ గా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. కాగా ఈ మూవీకి `వాల్తేరు వీర‌య్య‌` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేసే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు బాబి వున్న విష‌యం తెలిసిందే.

శృతిహాస‌న్ .. చిరు ప‌క్క‌న ఫైన‌ల్ అయితే ఆమె న‌టిస్తున్న రెండవ సీనియ‌ర్ హీరో చిరునే కావ‌డం విశేషం. తండ్రి క‌మ‌ల్ కు స‌మ‌కాలీకుడైన మెగాస్టార్ ప‌క్క‌న శృతిహాస‌న్ ఎలా క‌నిపిస్తుందా? .. ఎలా న‌టిస్తుందా? అని అంతా అప్పుడే ఊహించుకుంటున్నారు. ఫ్యాన్స్ అయితే కాంబో అదిరిపోద్ద‌ని చెప్పుకుంటున్నారు.



Tags:    
  • megastar chiranjeevi 
  • chiranjeevi 
  • ram charan 
  • Godfather 
  • Walter Veeranna 
  • Bhola Shankar 
  • acharya 
  • Shruti Hassan 
  • Megastar 154 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS