OTT లకు ముకుతాడు వేయడం క్రియేటివిటీని చంపి అవకాశాల్ని హరించడమే!
ఓటీటీ ఇన్నాళ్లు స్వేచ్ఛా విజువల్ మాధ్యమంగా అలరించింది. దీనివల్ల బోలెడంత క్రియేటివిటీని మేకర్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ మాధ్యమంలో అవకాశాలు పెరిగాయి. కానీ ఇప్పుడు రూల్స్ మారబోతున్నాయి. మునుముందు ఓటీటీలపై ఆంక్షలు పెరగబోతున్నాయని సంకేతం అందింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఓటీటీలకు ముకుతాడు వేయబోతోంది. అయితే ఇది సరైనదేనా? అని ప్రశ్నిస్తే.. అందాల కథానాయిక ఓటీటీ స్పెషలిస్ట్ రాధికా ఆప్టే ఇచ్చిన వివరణ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది.
ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్ ఫారమ్ లు నిజానికి భయానక సన్నివేశాన్ని ఎదుర్కోబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనను ఎదుర్కొంటున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలి అని మేం అర్థం చేసుకున్నా.. ఇతరులు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. జీవితంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయనే దాని గురించి ప్రజలు చాలా సహనంతో ఉండాలి. అది ఒకరి జీవన విధానం అని గుర్తించాలి... అని రాధికా ఆప్టే అన్నారు. OTT విషయంలో అధికారుల జోక్యంపై నా తీవ్ర విమర్శలు గుప్పించారు.
దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాధిక అన్నారు. ప్రేక్షకులకు విభిన్నమైన కంటెంట్ ను అందించడమే కాకుండా దేశీయ అంతర్జాతీయ కళాకారులకు మేకర్స్ కి మధ్య వంతెనగా OTT ప్లాట్ ఫారమ్ లు పనిచేస్తాయని చెప్పారు. ఈ వేదిక చాలా అవకాశాల్ని ఉపాధిని ఇచ్చింది. OTT అందించినది వీక్షకుల సంఖ్య కూడా అసాధారణం. రాబోయే నాలుగైదు సంవత్సరాలలో చాలా విషయాలు మెరుగుపడనున్నాయి. స్టార్లను అంతర్జాతీయంగా మిళితం చేసే వీలుంది.. అంటూ కొత్త పాయింట్లను రైజ్ చేశారు రాధిక.
అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ తాండవ్ వివాదం తరువాత స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలు ప్రభుత్వ స్కానర్ పరిధిలోకి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్- అమెజాన్ ప్రైమ్ వీడియో- డిస్నీ + హాట్‌స్టార్.. తదితర OTT ప్లాట్ ఫారమ్ లపై మూడు-స్థాయి ఫిర్యాదుల పరిష్కార విధానం(నీతి నియమావళి) వర్తిస్తుందని గత నెలలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం డిస్నీ + హాట్ స్టార్ విఐపిలో ప్రసారం కానున్న ఆనంద్ గాంధీ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్ `ఓకె కంప్యూటర్`లో ఆప్టే ఒక కీలక పాత్రను పోషించారు. పూజా శెట్టి - నీల్ పగేదర్ ఈ సిరీస్ కర్తలు. వారే దర్శకత్వం వహించారు. ఓటీటీలో మొదటిసారి హోమో సేపియన్స్ రోబోలతో సేపియన్లు కలుస్తారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఆకట్టుకుంటుంది. రీఫ్రెషింగ్ గా ఉండే పాయింట్ తో ఈ సిరీస్ తెరకెక్కిందని తెలిపారు.
గతంలో భారతదేశం సైన్స్ ఫిక్షన్ తరంలో సత్యజిత్ రే 1969 చిత్రం `గూపీ గైన్ బాఘా బైన్` .. శేఖర్ కపూర్ `మిస్టర్ ఇండియా` ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ చిత్రాలు. ఈ చిత్రాలన్నింటిలో కథ చెప్పడం ప్రత్యేకమైనది. కార్గో ..ఓకే కంప్యూటర్ చాలా సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాజెక్టులు (కళా ప్రక్రియలో)... అని ఆప్టే చెప్పారు. 2001: ఎ స్పేస్ ఒడిస్సీ-ది ఫ్లై- 1982 -బ్లేడ్ రన్నర్ ఆమెకు ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో కొన్ని అనితెలిపారు. ప్రజలు తెలివిగా ఆలోచిస్తున్నారని ఇలాంటివి ఆదరిస్తారని కూడా అన్నారు.