'ఏకే' రీమేక్ లో జోడీలు కుదిరినట్లేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి ఓ భారీ మల్టీస్టారర్ లో నటించనున్న సంగతి తెలిసిందే. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' కి తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో బిజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో నటించే ఇతర ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇందులో పవన్ - రానా లకు భార్య పాత్రలు నిడివి తక్కువైనా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలానే రానా భార్యగా డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కీలకమైన రానా తండ్రి పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సముద్రఖని నటిస్తాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా, పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.12 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.