టాలీవుడ్ లో మళ్ళీ కరోనా కలకలం..!

Update: 2021-04-03 17:30 GMT
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతూ ఉండటం అందరూ కలవరపడుతున్నారు. ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. అయితే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లోనూ కరోనా కలకలం మొదలైయింది. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నివేదా ఈ మధ్య 'వకీల్ సాబ్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో అక్కడ ఎవరి నుంచైనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.

అలానే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు కొన్ని మీడియాలలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా పాజిటివ్ అని తేలినట్లు చెబుతున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకగా.. కొన్ని రోజులకు మళ్ళీ నెగెటివ్ గా తేలిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్ - వివేక్ కూచిబొట్ల వంటి వారు కరోనా బారినపడి చికిత్స తీసుకొని త్వరగానే కోలుకున్నారని తెలుస్తోంది. అలానే మరికొందరు సినీ ప్రముఖులకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ బయటకు వెల్లడించడం లేదని టాక్ నడుస్తోంది.


Tags:    

Similar News