పాపం.. ఒక్క సినిమాతో పాతాళంలోకి పడిపోయారట...!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో సినీ పండితులు కూడా చెప్పలేరు. 'ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి' అనే నానుడి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. టాప్ రేంజ్ లో దూసుకుపోయిన వారు కూడా అట్టడుగు స్థాయికి దిగజారిన సందర్భాలు ఉన్నాయి.. క్రింది స్థాయి నుండి ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ టాప్ రేంజ్ కి చేరిన వాళ్ళున్నారు.. అక్కడ నుంచి ఒక్కసారిగా క్రిందకి పడిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే 'వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చినట్లు' చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్స్ చూసిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పుడు సినిమాల నుంచి దాదాపుగా తప్పుకునే పరిస్థితి వచ్చిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో ఉన్న అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించి సక్సెస్ లు చూసింది. అయితే ఇప్పుడు ఈ సంస్థ యంగ్ హీరోలతో సినిమాలు తీస్తున్నప్పటికీ విజయాలను మాత్రం అందుకోలేకపోతోంది. ఇండస్ట్రీలో ప్రచార కార్యక్రమాలతో కలిపి ఆ నిర్మాతకు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల అనుబంధముంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా చిత్ర నిర్మాణం చేపడుతూ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి వారితో సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్స్ అందించింది. ఇప్పుడు మాత్రం ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సంస్థకి ఎన్నో ఏళ్ళ నుంచి 'హిట్ అనేది అందని ద్రాక్షలా' మారింది. అయితే ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌజ్ క్లోజ్ అయ్యే పరిస్థితికి రావడానికి ఎన్నో అంచనాలతో తీసిన సినిమాయే కారణమంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
టాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోని పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా చేసారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ హీరో తమ నిర్మాణ సంస్థని గట్టెక్కిస్తాడు అని భావిస్తే అదే హీరో ఒక్క సినిమాతో పాతాళంలోకి తొక్కేసాడనే కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమా వలన సదరు నిర్మాత దాదాపు 32 కోట్లు మేర నష్టపోయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ముందెప్పుడు ఇంత భారీ రేంజ్ లో ఈ నిర్మాణ సంస్థకు నష్టం రాలేదట. ఈ నేపథ్యంలో మరో సినిమా నిర్మించే పరిస్థితుల్లో వారు లేరని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు కరోనా మహమ్మారి వలన ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రొడ్యూసర్ నుంచి ఇప్పుడప్పుడే సినిమాలు రావని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు. ఏదేమైనా ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలుగొందిన సంస్థ ఇప్పుడు సినిమాలు నిర్మించడానికి ఆలోచించే పరిస్థితి రావడం నిజంగా వారి బ్యాడ్ లక్ అని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.