కరోనా ఎఫెక్ట్: సినిమాల్లో లిప్ లాకులు హుష్ కాకీ?

Update: 2020-04-17 05:10 GMT
కాలంతో పాటు ఎవరైనా మారక తప్పదు. ఎలాంటి వారైనా.. ఎంతటి సెలబ్రిటీ అయినా ఎంతటి ఫిలింమేకర్లైనా.. ఇందుకు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్ ఫిలిం మేకర్లకు ఫారిన్ షూటింగ్ అంటే అదో సరదా. ప్రైవసీ ఉంటుందనే ఉద్దేశం కావచ్చు.. తక్కువ ఖర్చుతో మంచి లొకేషన్లలో చిత్రీకరణ అనే ఆలోచన కావచ్చు. కారణాలేవైనా విదేశీ షూటింగులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. కానీ ఇకపై వాటినన్నిటినీ ఆపేయాల్సి ఉంది. అంతేకాదు సోషల్ డిస్టెన్సింగ్ రూల్ ప్రకారం ఒకరికి ఒకరు నాలుగడుగులు - ఆరడుగులు.. వీలైతే పది అడుగులు దూరంగా ఉండాలి. ఇలా అడుగుల కొద్ది దూరంలో నిలబడితే లిప్ లాక్ లు ఏం కావాలి.. ఆ లిప్ లాకులు తమ గోడు ఎవరితో చెప్పుకోవాలి? ఈ లెక్కన సినిమాల్లో లిప్ కిస్ లు ఉంటాయా పోతాయా?

అసలే ఈ మధ్య టాలీవుడ్ లో లిప్ లాకుల  జోరు విపరీతంగా పెరిగింది. ఆ హీరో ఈ:హీరో అనే తేడా లేకుండా అందరు హీరోలు తమ తమ హీరోయిన్లతో ముద్దు ముచ్చట్లు సాగిస్తూ ఇమ్రాన్ హష్మీ అనే పేరు తెచ్చుకుంటున్నారు. మరి లాక్ డౌన్ విరమణ తర్వాత షూటింగులు జరిగే సమయంలో డైరెక్టర్లు "యాక్షన్.. లిప్ లాక్" అంటే.. హీరో గారు.. హీరోయిన్ గారు నో..నో అని చెప్పాలి.  అలా కాకుండా అధరచుంబనానికి సై సై అంటే ఆ తర్వాత మిగిలేది క్లోరొక్విన్లు.. ఐసోలేషన్లు..  క్వారంటైన్లే.

మరి ఇలాంటి పరిస్థితుల్లో విలన్లపై యుద్ధం ప్రకటించడం.. భీకర పోరాటం చేయడం గొప్ప విషయాలు కానే కాదు. హీరోయిన్లకు లిప్ లాక్ కు ఇవ్వడం సూపర్ హీరోయిజం.  హీరోయిన్లకు రిస్క్ లేదని కాదు.. హీరోయిన్లకు కూడా ఈ కిస్సులు రిస్కే. నిన్న మొన్నటి వరకూ ఈ లిప్ లాక్ ల బెడద ఎక్కువైందని సంప్రదాయవాదులు తిట్టిపోశారు. లిప్ లాక్ లేని ఒక లవ్వే కాదు అన్నట్టుగా రెచ్చిపోయారు కొందరు హీరోలు. లిప్ లాక్ అనేది ఒక సినిమాకి టైటిల్ ముందు వచ్చే ముఖేష్ యాడ్ లాంటిదని.. దాన్ని సినిమా నుంచి వేరు చేయలేమని అభిప్రాయం కలిగించారు. మరి ఈ ఇమ్రాన్ హష్మి జూనియర్లందరూ ఇప్పుడు ఏం చేస్తారబ్బా??
Tags:    

Similar News